ఆ విషయంలో సిద్ధార్థకి సపోర్ట్ చేసిన తెలుగు హీరోయిన్...

తెలుగులో ప్రముఖ దర్శకుడు భాస్కర్ దర్శకత్వం వహించిన బొమ్మరిల్లు చిత్రంతో తెలుగు సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ప్రముఖ టాలీవుడ్ హీరో “సిద్ధార్థ” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే సిద్ధార్థ స్వతహాగా తమిళ సినీ పరిశ్రమకు చెందినప్పటి తెలుగులో కూడా తన చిత్రాలతో మంచి మార్కెట్ ని సంపాదించుకున్నాడు.

 Scam 1992 Fame Shreya Dhanwanthary Support To The Hero Siddharth-TeluguStop.com

ఈ మధ్య కాలంలో కథల విషయంలో అవగాహన లోపించడంతో ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోతున్నాడు.

అయితే తాజాగా హీరో సిద్ధార్థ ఫోన్ నెంబర్ ఇంటర్నెట్లో లీక్ అవడంతో తమిళనాడు రాష్ట్రంలోని ఓ ప్రముఖ రాజకీయ పార్టీకి చెందిన కొందరు నాయకులు హీరో సిద్ధార్థ ని చంపేస్తామని బెదిరించసాగారు.

 Scam 1992 Fame Shreya Dhanwanthary Support To The Hero Siddharth-ఆ విషయంలో సిద్ధార్థకి సపోర్ట్ చేసిన తెలుగు హీరోయిన్…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అంతేకాకుండా హీరో సిద్ధార్థ ఇంట్లో ఉంటున్న మహిళలపై కూడా దారుణంగా అత్యాచారం చేస్తామని అసభ్యకరంగా ఫోన్లు చేసి మాట్లాడుతున్నారని ఇటీవలే సిద్ధార్థ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు.దీంతో తాజాగా ఈ విషయంపై తెలుగు హీరోయిన్ శ్రేయ ధన్వంతరి స్పందించింది.

ఇందులో భాగంగా తన మద్దతు ని హీరో సిద్ధార్థ కి తెలిపింది.అంతేకాకుండా డా ఓ ప్రముఖ సెలబ్రెటీ పై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు మరియు బెదిరింపులకు పాల్పడుతున్న వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరింది.

Telugu Bjp It Cell, Director Shankar, Indian 2 Movie, Maha Samudram Movie Update, Scam 1992 Fame Shreya Dhanwanthary Support To The Hero Siddharth, Shreya Dhanwanthary, Siddhartha Issue, Telugu Actress, Threats To Siddharth, Tollywood-Movie

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం హీరో సిద్ధార్థ తెలుగులో “మహా సముద్రం” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.ఈచిత్రానికి ఆర్ఎక్స్ 100 మూవీ ఫేమ్ “అజయ్ భూపతి” దర్శకత్వం వహిస్తున్నాడు.కాగా ఈ చిత్రం తమిళం, తెలుగు రెండు భాషలలోనూ విడుదల కానుంది.అలాగే ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తున్న “ఇండియన్ 2” చిత్రంలో కూడా సిద్ధార్థ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

కాగా ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తున్న కారణంగా కొంతకాలం పాటు ఈ చిత్ర షూటింగ్ పనులను వాయిదా వేశారు.

హీరోయిన్ శ్రేయ ధన్వంతరి గతంలో అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన “జోష్” అలాగే సందీప్ కిషన్, దర్శకుడు వెంకీ అట్లూరి మెయిన్ లీడ్ పాత్రలో నటించిన “స్నేహగీతం” తదితర చిత్రాలలో హీరోయిన్ గా నటించింది.

అలాగే ఇటీవలే మంచి విజయం సాధించినటువంటి వెబ్ సీరీస్ “స్కామ్ 1992” లో కూడా కీలక పాత్ర పోషించి ప్రేక్షకులను బాగా అలరించింది.

#Scam1992 #Indian 2 Movie #Bjp It Cell #MahaSamudram #ThreatsTo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు