దిశా నిందితుల ఎన్ కౌంటర్ పై విచారణ మొదలెట్టిన కమిషన్

హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన దిశ సంఘటన గురించి అందరికి తెలిసిందే.ఈ ఘటన తర్వాత నిందితుల్ని పట్టుకున్న పోలీసులు వారిని విచారణకి తీసుకెళ్ళే క్రమంలో తప్పించుకోవడానికి ప్రయత్నించడంతో ఎన్ కౌంటర్ చేశారు.

 Sc Team Begins Probe Into Disha Rape And Murder Case-TeluguStop.com

అయితే ఈ ఎన్ కౌంటర్ ని సామాన్య ప్రజలతో పాటు చాలా మంది సమర్ధించారు.తప్పు చేసిన వాళ్ళకి ఈ తరహాలో వెంటనే శిక్షలు పడాలని కోరారు.

అయితే ఈ ఎన్ కౌంటర్ ని కొన్ని మహిళా సంఘాలు, మానవ హక్కుల కమిషన్ తో పాటు కుల సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి.కుల సంఘాలు అయితే మరో అడుగు ముందుకేసి దిశ నిందితులు తక్కువ కులానికి చెందిన వారు కాబట్టే ఎన్ కౌంటర్ చేసారని, అదే పెద్ద కులానికి చెందిన వారైతే ఇలా చేసేవారా అంటూ మాట్లాడారు.

తరువాత ఈ ఎన్ కౌంటర్ పై కొందఱు సుప్రీం కోర్టులో రిట్ పిటీషన్ వేశారు.

ఎన్ కౌంటర్ పై సీబీఐతో కాని ప్రత్యేక కమిషన్ తో కాని విచారణ జరిపించాలని కోరారు.

ఆర్టికల్ 32 ప్రకారం నిదితుల ప్రాథమిక హక్కులు హరించే విధంగా పోలీసులు వ్యవహరించారని ఆ పిటీషన్ లో పేర్కొన్నారు.ఇదిలా ఉంటే సుప్రీం కోర్టు ఆ పిటీషన్ ని స్వీకరించి దానిపై విచారణకి జస్టిస్ వీఎస్ సిర్పూర్కర్ కమిషన్ ఏర్పాటు చేసింది.

ఈ కమిషన్ తన విచారణ మొదలెట్టింది.హైదరాబాద్‌లోని తెలంగాణ హైకోర్టులో కమిషన్‌కు ఓ కార్యాలయాన్ని కేటాయించింది.జస్టిస్ వీఎస్ సిర్పూర్కర్ కమిషన్ ఈ రోజు కార్యాలయానికి వచ్చింది.దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసు విచారణను అధికారికంగా ప్రారంభించింది.

ఇక ఈ కేసులో కీలక ఆధారాలు సేకరించే పని మొదలెట్టారు.మరి దీనిపై కమిషన్ ఎలాంటి రిపోర్ట్ ఇస్తుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube