ఇక డబ్బులు కోసం ఏటీఎంకి కూడా వెళ్లక్కర్లేదు... హోమ్ డెలివరీ అంటున్న ఎస్బిఐ...!

దేశంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తుంది.ఈ మహమ్మారి కారణంగా చాల మంది ఇంటి నుండి బయటికి రావడానికి భయపడిపోతున్నారు.

 Sbi Will Deliver Cash At Home,atm, Money , Sbi , Home Delivery , Sbi Customers,-TeluguStop.com

అయితే ఇప్పుడు ఉన్న క్లిష్ట పరిస్థితులకి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానం కూడా అభివృద్ధి చెందింది.మనం ఇంట్లో కూర్చొనే మనకు ఏది కావాలి అంటే అది మన దగ్గరికి వచ్చేంతగా టెక్నాలజీ అభివృద్ధి చెందింది.

అయితే ఇప్పుడు చాల మంది నెట్ బ్యాంకింగ్ ని ఎక్కువ వాడుతున్నారు.అయితే ఒకప్పుడు బ్యాంకు కానీ, ఏటీఎం దగ్గరికి కానీ వెళ్లినా గంటల తరబడి నిల్చొని డబ్బులు తీసుకోవాల్సి వచ్చేది.

ఇక ఇప్పుడు అంత అవసరం లేకుండా మనం ఉన్న చోటు నుండే డబ్బులు తీసుకోవడానికి గల సదుపాయాన్ని ఎస్బిఐ బ్యాంకు వారు అందుబాటులోకి తీసుకొచ్చారు.కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతున్న సమయంలో ఎస్బిఐ బ్యాంకు ఏటీఎం సర్వీసుల ద్వారా ఇంటికి వచ్చి డబ్బులు అందించడానికి సిద్ధం అవుతుంది.

ఇలా చేయడం వలన కస్టమర్లు ఏటీఎం వద్దకు వెళ్లి డబ్బులు తెచ్చుకోవడానికి శ్రమ పడాల్సిన అవసరం ఉండదు.ఒక్క ఫోన్ చేస్తే చాలు మన ఇంటికే డబ్బులు తీసుకొచ్చి ఇస్తారు.

అయితే దీనికి సంబంధించిన విషయాలను ఎస్బీఐ జనరల్ మేనేజర్ అజయ్ కుమార్ తాజాగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు.

అయితే కొత్త సర్వీసులను వాట్సాప్ ఎస్ఎంఎస్‌తో ఎస్బీఐ వాట్సాప్ అండ్ ఎస్‌బీఐ ఫోన్ కాల్ సర్వీస్‌లు పొందొచ్చని తెలిపారు.అయితే ఇందుకు సంబంధించిన సేవలు కేవలం లక్నో నగరంలో మాత్రమే అందుబాటులో ఉన్నాయని తెలిపారు.అంతేకాదు ఈ సిస్టం ను అక్కడ విజయవంతం అవుతే వేరే ప్రాంతాల్లో కూడా అందుబాటులోకి తీసుకొస్తారని ఆయన వెల్లడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube