జాగ్రత్త : వాట్సప్‌ ద్వారా కొత్త రకం మోసం ప్రారంభం అయ్యిందన్న ఎస్బీఐ... వినియోగదారులకు హెచ్చరిక  

  • టెక్నాలజీ పెరుగుతా ఉంటే కొత్త రకం మోసాలు పెరుగుతున్నాయి. అత్యంత దారుణమైన కొన్ని యాప్స్‌ వచ్చాయి, అవి మన మొబైల్స్‌లో ఉన్న డేటాను, మొత్తం సమాచారంను కాజేస్తున్నాయి. మనకు తెలియకుండానే అవి మన ఫోన్‌ను వేరే వారికి అప్పగిస్తున్నాయి. ముఖ్యంగా బ్యాంకు లావా దేవీలకు సంబంధించిన ఓటీపీలు కూడా వేరే వారి వద్దకు వెళ్లి పోతున్నాయి. ఓటీపీలు వెళ్లి పోతున్న కారణంగా ఖాతాలో డబ్బు మాయం అయ్యే ప్రమాదం ఉంది. ఓటీపీలు ఎవరికి చెప్పవద్దని బ్యాంకులు పదే పదే చెబుతున్న నేపథ్యంలో ఓటీపీలు ఎవరికి చెప్పడం లేదు. అయితే చెప్పకుండానే తెలుసుకునేలా కొత్త రకంగా టెక్నాలజీ వచ్చింది.

  • తాజాగా ఎస్బీఐ తమ వినియోగదారులకు హెచ్చరిక జారీ చేసింది. వాట్సప్‌ ద్వారా కొందరు ఓటీపీలను తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వారి పట్ల జాగ్రత్తగా ఉండాల్సిందిగా తెలియజేశారు. వారి దృష్టికి వచ్చినదాని ప్రకారం కొందరు మోసగాళ్లు వాట్సప్‌ ద్వారా బ్యాంకు మోసాలు, ఓటీపీ, పాస్‌వర్డ్‌లపై అవగాహణ కలిగిస్తున్నట్లుగా నమ్మిస్తారు. ఎవరికి వాటిని ఇవ్వవద్దంటూ చెబుతారు. ఆ తర్వాత వారు కొన్ని లింక్స్‌ను పంపిస్తారు. వాటిని క్లిక్‌ చేస్తే మీ ఫోన్‌లో ఉన్న సమాచారం మరింత భద్రంగా ఉంటుందని నమ్మిస్తారు. అయితే వారు చెబుతున్నది అబద్దం. ఎప్పుడైతే ఆ లింక్స్‌ను క్లిక్‌ చేస్తారో అప్పుడు మీ మొబైల్‌లో డేటా మొత్తం వారికి చేరిపోతుంది.

  • SBI Warns Customers Of WhatsApp Scam-Sbi Sms Whatsapp Message Whatsapp Scam

    SBI Warns Customers Of WhatsApp Scam

  • మీ బ్యాంకు లావా దేవీలకు సంబంధించి ఎలాంటి విషయాలను అయినా వారు చూసే విధంగా మొత్తం పరిస్థితి మారిపోతుంది. డబ్బులు తీయడం లేదా బ్యాంకుకు సంబంధించిన విషయాలు మొత్తం కూడా మొబైల్‌ హ్యాక్‌ ద్వారా జరిగి పోతుంది. దాంతో మీకు తెలియకుండానే మీ ఖాతా ఖాలీ అవుతుందని ఎస్బీఐ హెచ్చరిస్తుంది. అందుకే వాట్సప్‌లో స్ట్రేజంర్స్‌ పంపే లింక్స్‌ను ఓపెన్‌ చేయడం అంత మంచిది కాదు. ఆ లింక్స్‌ బ్యాంకు యూఆర్‌ఎల్‌ను పోలి ఉన్నా కూడా వాటిని ఓపెన్‌ చేయవద్దని సూచిస్తున్నారు.

  • SBI Warns Customers Of WhatsApp Scam-Sbi Sms Whatsapp Message Whatsapp Scam
  • ఇలాంటి మోసాలు విదేశాల్లో జరుగుతున్నాయి. ఇండియాలో కూడా ప్రారంభం అవుతున్నందున ముందస్తుగానే ఎస్బీఐ వారు తమ వినియోగదారులకు సూచిస్తోంది. ఇతర బ్యాంకు ఖాతాలు కలిగిన వారు కూడా ఇలాంటి మోసాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. వాట్సప్‌ వినియోగదారులు ఈ విషయాల పట్ల చాలా జాగ్రత్తతో ఉండాలి.