మీరు SBI డెబిట్ కార్డ్ వాడుతున్నారా.! అయితే మీకో గమనిక.! వెంటనే మార్చుకోండి.!  

మీరు Sbi డెబిట్ కార్డ్ వాడుతున్నారా.! అయితే మీకో గమనిక.! వెంటనే మార్చుకోండి.!-

డెబిట్ కార్డుల విషయంలో ఎన్ని భద్రతలు తీసుకున్నా ఎన్నో మోసాలు జరుగుతూనే ఉన్నాయి.ఆన్ లైన్ బ్యాంకు లావాదేవీలు సులువుగా జరపడానికి… మోసపూరిత లావాదేవీల నుంచి ఖాతాదారుల డబ్బులకు భద్రత కల్పించేందుకు స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా కొత్త నిర్ణయం తీసుకుంది.

ఈ నేపథ్యంలో మాగ్నటిక్‌ స్ట్రిప్‌ కార్డ్ కు బదులుగా… ఈఎంవీ(యూరో పే మాస్టర్‌కార్డు వీసా) చిప్‌ కార్డులను తీసుకోవాలని కోరుతోంది.ఈ కొత్త కార్డు తీసుకోడానికి ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు టైం ఇంచింది బ్యాంకు యాజమాన్యం.

మీరు Sbi డెబిట్ కార్డ్ వాడుతున్నారా.! అయితే మీకో గమనిక.! వెంటనే మార్చుకోండి.!- Telugu Viral News-SBI To Customers Switch Chip-based Debit Cards By Dec 31-

ఇప్పటికే చాలా బ్యాంకులు ఈ కొత్త కార్డునే అందచేశారు.

సైబర్ నేరగాళ్లు స్కిమ్మింగ్ లాంటి నేరాలు చేయకుండా చిప్ కార్డ్ అడ్డుకుంటుంది.

కార్డును ఎవరైనా దొంగతనం చేసినా.వెంటనే బ్లాక్ చేయడానికి, బ్యాంక్ సిబ్బంది వెంటనే కార్డును యాక్సెస్ చేయడానికి వీలవుతుంది.

అందుకే చిప్ కార్డులు జారీచేయాలని ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాలు కూడా జారీ అయ్యాయి.ఈ మార్గదర్శకాలను తాజాగా ఎస్బీఐ అమలుపరుస్తోంది.

అంటే ప్రస్తుతం చాలామంది దగ్గరున్న డెబిట్ కార్డుల స్థానంలో EMV చిప్‌ డెబిట్‌ కార్డును డిసెంబరు 31, 2018లోగా మార్చుకోవాలని విజ్ఞప్తిచేస్తోంది.కొత్త కార్డ్ పొందేందుకు ఎటువంటి చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని బ్యాంక్ తెలిపింది.

అకౌంట్ హోల్డర్లకు చిప్ కార్డును ఫ్రీగా ఇస్తున్నారు.కార్డు మార్చుకోవాల్సినవారు.

బ్యాంక్ ఖాతాలో సంప్రదించాల్సి ఉంటుంది.

.

తాజా వార్తలు