ఖాతాదారులకు షాకిచ్చిన ఎస్బీఐ.. ఇలా చేస్తే జేబుకు చిల్లే.. !

ప్రస్తుతం సమాజంలో నెలకొన్న పరిస్దితుల్లో మధ్యతరగతి మనిషి జీవితం సజావుగా సాగే వీలు లేకుండా ఉంది.తన కుటుంబంతో కలసి సంతోషంగా గడపడానికి కూడా మనస్సు ఒప్పుకోవడం లేదనే బాధ లోలోపల ఉన్నా ఏదోలా తన జీవితాన్ని నెట్టుకొస్తున్నాడట.

 Sbi, Shocks Customers, Account Balance, Penalty Charges,latest News,ac-TeluguStop.com

ఇక ప్రజల కోసం రాజకీయాల్లోకి వస్తున్నా అని సొల్లు చెప్పే నాయకులు.అధికారంలోకి వచ్చాక కోట్లు వెనకేసుకుని వారి జీవితాలను మార్చుకుంటున్నారే గానీ.మధ్యతరగతి బ్రతుకుల్లో మార్పు లేదు.పేదవాడు మరింత పేదవానిగా మిగిలిపోతున్నాడు.

ఇప్పటికే కనీసం రెండుపూటలా కడుపునిండా తిండి తినలేని పరిస్దితుల్లో పేదలు ఉండగా ఈ మధ్యకాలంలో పెరుగుతున్న నిత్యావసరాల ధరల విషయంలో నోరు విప్పే నాయకుడే కరువైయ్యాడు.

Telugu Balance, Penalty, Customers-Latest News - Telugu

ఇలా సామాన్య జీవిని అందరు దోచుకుంటుండగా, తాజాగా ఎస్బీఐ బ్యాంకు కూడా ఇదే బాట పట్టిందట.ఎలాగో తెలుసుకుంటే.ఎస్బీఐ ఏటీఎంలలో డబ్బు తీసే ముందు మీ ఖాతాలో డబ్బు ఎంతుందో తెలుసుకుని డ్రా చేయాలట.

ఎందుకంటే విత్‌ డ్రా చేసే సమయంలో ఖాతాలో సరిపడా డబ్బు లేకపోతే జరిమానా వేయడానికి సిద్దం అయ్యింది ఎస్బీఐ.

ఈ మేరకు కొత్త నిబంధనలను తీసుకువచ్చింది.ఇక నుండి ఖాతాలో సరిపడా డబ్బు లేక ట్రాన్సాక్షన్‌ ఫెయిల్‌ అయిన ప్రతీసారి రూ.20+జీఎస్టీ జరిమానా విధించడానికి సిద్దం అయ్యింది.అదీగాక పరిమితికి మించి డబ్బు విత్‌డ్రా చేస్తే కూడా చార్జి పడుతుందట.మరీ మీ ఏటియంలో డబ్బులు లేకుంటే మీకు కూడా ఫైన్ వేయాలి కదా సారు.

ఈ నిబంధన కూడా అమలు చేయండి అంటున్నారట, విషయం తెలిసిన కొందరు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube