రైతు కస్టమర్లకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త...!

దాదాపుగా మన నేషనల్ బ్యాంక్స్ అన్నీ కూడా రైతులకోసం రకరకాల స్పెషల్ సర్వీసులను అందిస్తూ ఉంటాయి.కొన్ని రకాలైన ఋణ సదుపాయాలను కలిగిస్తూ ఉంటాయి.

 State Bank Of India Good News For Farmer Customers  Sbi, Rythu, Farmers, God New-TeluguStop.com

అందులో ముఖ్యమైనది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ బ్యాంకు తన కస్టమర్లకు బ్యాంక్ అకౌంట్ దగ్గరి నుంచి రుణాల వరకు పలు రకాల సర్వీసులు అందిస్తుంది.

అంతే కాకుండా రైతులకు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తోంది.ఈ క్రమంలోనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రైతులకు ప్రయోజనం కలిగించే నిర్ణయం తీసుకుంది.

దీనికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిటల్ ప్లాట్‌ ఫామ్ యోనో యాప్‌ లో ఓ కొత్త ఫీచర్‌ను ప్రవేశ పెట్టింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ రజ్‌నీష్ కుమార్ దీనికి సంబంధించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇక్రాకు సంబంధించిన ఇండియన్ హార్టికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ సీడ్ పోర్టల్‌ ను యోనో యాప్‌ తో లింక్ చేసింది.కాగా.కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ SBI యోనో ప్లాట్‌ ఫామ్‌ కు విత్తనాలు విక్రయించే పోర్టల్‌ ను లింక్ చేశారు.ఇకనుండి రైతులు తమకు కావలసిన పంట విత్తనాలను ఎంచక్కా ఆన్‌ లైన్‌ లోనే కొనుగోలు చేయొచ్చు.

టమోటా, క్యాప్సికమ్, మిరప, బెండా, చిక్కుడు, వేరు శనగ ఇంకా అనేక రకాలైన విత్తనాలు ఆన్‌ లైన్ ద్వారా కొనుగోలు చేయొచ్చు.విత్తనాలు కొనుగోలు చేయాలని భావించే వారు యోనో యాప్‌‌ కచ్చితంగా వాడాలి.

దీన్ని గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌ లోడ్ చేసుకోవచ్చు.తర్వాత రిజిస్టర్ చేసుకొని లాగిన్ అవ్వాలి.

యాప్‌లో యోనో క్రిషి ఆప్షన్‌ పై క్లిక్ చేసి విత్తనాలు కొనొచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు మాత్రమే ఈ బెనిఫిట్ కలదు.

ఇంకే బ్యాంక్ కస్టమర్లకు ఈ సౌకర్యం లేదని గమనించగలరు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube