హోమ్‌లోన్ల విషయంలో షాకిస్తున్న ఎస్‌బీఐ.. ?

దేశంలో కరోనా వచ్చినప్పటి నుండి ప్రతి వారి జీవన విధానంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి.ఇక ధరలకైతే రెక్కలు వచ్చాయి.

 Sbi To Increase Home Loans Interest Rate, Sbi, Home Loan In Sbi, Sbi Home Loan I-TeluguStop.com

ఇప్పటికే మార్కెట్లో లభించే ప్రతి వస్తువు ధర చుక్కలను అంటగా, అల్లాడిపోతున్న సామాన్యుడి విషయంలో ఆలోచించే నేతలే కరువైయ్యారు.

ఇకపోతే సొంతింటి కల కలలా మిగిలిపోయే పరిస్దితులు ప్రస్తుతం నెలకొన్న విషయం తెలిసిందే.

ఎందుకంటే బ్యాంకులు అందించే హోమ్‌లోన్ల వడ్దీ రేట్లను పెంచుతూ దేశంలోని అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది.

ఇదిలా ఉండగా మార్చి 31 వ‌ర‌కూ అతి త‌క్కువ వ‌డ్డీ రేటు (6.7 శాతం)కు హోమ్‌లోన్ అందించిన ఎస్‌బీఐ.ఆ గ‌డువు ముగియ‌డంతో వ‌డ్డీరేటును 6.95 శాతానికి పెంచి నడ్డి విరిచింది.కాగా ఏప్రిల్ 1 నుంచే ఈ కొత్త వ‌డ్డీరేట్లు అమల్లోకి వ‌చ్చిన‌ట్లు ఆ బ్యాంకు త‌న వెబ్‌సైట్‌లో వెల్ల‌డించింది.

ఇక ఇప్పటి వరకు వ‌డ్డీ రేట్లు త‌గ్గించిన ఇత‌ర బ్యాంకులు కూడా ఇప్పుడు ఎస్‌బీఐను చూసి ఆ రేట్లు పెంచే అవ‌కాశాలు ఉన్నాయట.అదీగాక అన్ని హోమ్‌లోన్ల‌ పై ప్రాసెసింగ్ ఫీజు కూడా వ‌సూలు చేయ‌నున్న‌ట్లు ఈ బ్యాంకు స్ప‌ష్టం చేసింది.

ఇక ఈ నిర్ణయంలోని నష్టాన్ని ఎందరు భరిస్తారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube