రుణ గ్రహీత‌ల‌పై మ‌రింత భారం మోపిన ఎస్బీఐ

ఖాతాదారుల‌కు ఎస్బీఐ షాక్ ఇచ్చింది.రుణాల‌పై వ‌సూలు చేసే మార్జిన‌ల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ -బేస్డ్ లెండింగ్ రేటును మ‌రోసారి పెంచింది.

 Sbi Has Put More Burden On Borrowers , Bank, Borrowers, Sbi, Rbi, Burden-TeluguStop.com

ఈ క్ర‌మంలోనే తాజాగా ఎంసీఎల్ఆర్ రేటును 20 బీపీఎస్ పాయింట్లు పెంచి రుణ గ్ర‌హీత‌ల‌పై మ‌రింత భారం మోపింది.కాగా స‌వ‌రించిన వ‌డ్డీరేట్లు ఈ రోజు నుంచే అమ‌ల్లోకి వ‌చ్చింది.

బాహ్య బెంచ్ మార్క్ ఆధారిత రుణ రేటు, రెపో లింక్డ్ లెండింగ్ రేటును 50 బీపీఎస్ పాయింట్ల మేర పెంచింది.ఆరు నెల‌ల వ్య‌వ‌ధి రుణాల వ‌డ్డీ రేటు 7.45 శాతం నుండి 7.65 శాతానికి పెరిగింది.సంవ‌త్స‌ర ప‌రిధి లోన్ల‌పై 7.90 శాతం, రెండేళ్లు, మూడు సంవ‌త్స‌రాల 8 శాతంగా ఉంచింది.మూడు నెల‌ల్లో మూడో పెంపు ఇది.ఇటీవ‌ల ఆర్బీఐ రెపో రేటు పెంచిన నేప‌థ్యంలో ఎస్బీఐ ఈ నిర్ణ‌యం ప్ర‌క‌టించింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube