ఎస్బిఐ కస్టమర్స్ కి అలెర్ట్.. ఏటీఎంలో డబ్బుల విత్ డ్రా రూల్స్ మార్పు..!

దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) తన కస్టమర్లను ఎప్పటికప్పుడు సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోకుండా ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంటుంది.తమ ఖాతాదారులు సైబర్ నేరాగాళ్ళ వలలో చిక్కకుండా ఎప్పటికప్పుడు వారిని అలర్ట్ చేస్తూ వస్తుంది.

 Sbi Customers Alert Cash Withdraw From Atm Rules Changed, Sbi ,custimers, Alert,-TeluguStop.com

ఈ క్రమంలోనే స్టేట్ బ్యాంక్ ఏటీఎం(ATM) సెంటర్ల వద్ద జరిగే మోసాలను తగ్గించే క్రమంలో ఒక సరి కొత్త ఆలోచన చేసింది.అదే ఓటీపీ(OTP) విధానం అన్నమాట.

ఈ విధానంతో ఏటీఎం సెంటర్స్ వద్ద జరిగే మోసాలను నివారించడం సులభతరం అవుతుందని ప్రకటించింది.ఇకమీదట లాగా మీరు స్టేట్ బ్యాంక్ ఏటీఎం సెంటర్ కు వెళ్లి డబ్బులు తీసుకోవడం కుదరదు.

ఎందుకంటే మీరు డబ్బులు డ్రా చేయాలంటే మీ వెంట మీరు బ్యాంకులో రిజిస్టర్ చేసుకున్న మొబైల్ మీతో ఉండాలి ఏటీఎం సెంటర్ లో డబ్బులను విత్ డ్రా చేసే సమయంలో మీ రిజిస్టర్ ఫోన్ నంబర్ కు ఒక ఓటీపీ వస్తుంది.అది నమోదు చేస్తేనే మీరుడబ్బులను విత్ డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

ఈ విధానం ద్వారా నేరగాళ్ల నుంచి ఖాతాదారులకు ఎటువంటి భయం ఉండదని SBI బ్యాంకు తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది.అయితే ప్రస్తుతం ఈ విధానం రూ.10 వేల లోపు డబ్బులు డ్రా చేసుకునే వారికి వర్తించదు.కానీ రూ.10 వేలు లేదా అంతకన్నా ఎక్కువ డ్రా చేసుకునే వారు మాత్రం తప్పనిసరిగా ఓటీపీని నమోదు చేస్తేనే డబ్బులు వస్తాయని బ్యాంకు స్పష్టం చేసింది.

Telugu Rupees, Ups, Changed, Custimers, Latest, Otpregistered, Sbi Customers, Sb

మరి ఈ సరికొత్త విధానం ద్వారా డబ్బులు ఎలా డ్రా చేయాలో తెలుసుకుందామా.ముందుగా ఖాతాదారుడు ఏటీఎం సెంటర్ కు వెళ్లేటప్పుడు వారి వెంట డెబిట్ కార్డుతో పాటు, రిజిస్టర్ మొబైల్ నంబర్ ను వెంట తీసుకెళ్లాలి.ఆ తరువాత మీరు ఎటిఎం మెషీన్ లో కార్డును ఇన్ సర్ట్ చేసి పిన్ నంబర్ ను నమోదు చేసి ఎంత మనీ విత్ డ్రా కావాలో నమోదు చేయాలి.

మీరు పదివేల కన్నా ఎక్కువగా డబ్బులు విత్ డ్రా చేయాలంటే మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కు ఓటీపీ(OTP) వస్తుంది.మీ మొబైల్ కు వచ్చిన ఓటీపీని నమోదు చేసిన తర్వాత గాని మీకు డబ్బులు మెషీన్ నుండి బయటకు రావు.

ఒక ట్రాన్సక్షన్ కి కేవలం ఒక ఓటీపీ మాత్రమే పని చేస్తుంది.మళ్ళీ డబ్బులు కావాలంటే మరొక ఓటీపీ వస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube