కొవిడ్‌ చికిత్సకు ఎస్‌బీఐ కవచ్‌ పర్సనల్‌ లోన్‌!

కొవిడ్‌ నేపథ్యంలో ఎంతోమంది ఉద్యోగం కోల్పోయిన వారు ఉన్నారు.దీని వల్ల వారి ఆర్థిక పరిస్థితి కూడా చేయి దాటిపోయిన సంఘటనలు ఉన్నాయి.

 Sbi Announced New Personal Loan To The Covid Related Treatment , Covid Treat Men-TeluguStop.com

ఇటువంటి వారికి చేయూత అందించడానికి దిగ్గజ ఎస్‌బీఐ బ్యాంక్‌ ఒక కొత్త పథకాన్ని పరిచయం చేసింది.దీంతో కేవలం ఎస్‌బీఐ వినియోగదారుడు మాత్రమే కాదు కుటుంబ సభ్యులు కూడా లబ్ధి పొందనున్నారు.

ఆ వివరాలు ఏంట దీనికి ఎవరు అర్హులు తెలుసుకుందాం.ఇప్పటికే వివిధ బ్యాంకులు కొవిడ్‌ కవరేజీ కోసం ఎన్నో పాలసీలను ప్రారంభించాయి.

కానీ, ఎస్‌బీఐ నయా పథకం ద్వారా రుణగ్రహీతలు మరింత లబ్ధి పొందనున్నారు.కేవలం నెలజీతం పొందే వారు కాకుండా ఎస్‌బీఐ వినియోగదారులందరికీ ఈ పథకం అందుబాటులో ఉంటుంది.

కరోనా చికిత్స నిమిత్తం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తన వినియోగదారులకు కవచ్‌ పర్సనల్‌ లోన్‌ను ప్రారంభించింది.వినియోగదారుడే కాకుండా తన కుటుంబ సభ్యుల కోసం కూడా కవచ్‌ పర్సనల్‌ లోన్‌ను వినియోగించుకోవచ్చు.రూ.5 లక్షల వరకు 5 ఏళ్లకు 8.5 శాతం ఏడాది వడ్డీతో అందిస్తోంది.దీనికి ఏ తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదని బ్యాంక్‌ తెలిపింది.ఈ రుణం ద్వారా కనీసం రూ.25 వేలు పొందవచ్చు.ఈ సదుపాయంతోపాటు రుణగ్రహీత 3 నెలలపాటు లోన్‌ మారటోరియం కూడా పొందవచ్చు దిగ్గజ స్టేట్‌ బ్యాంక్‌ ఈ పథకం కింద కొవిడ్‌ చికిత్సకు సంబంధించిన ఖర్చులు భరించడానికి రీయింబర్స్‌మెంట్‌ను అందిస్తోంది.

Telugu Covid, Sbi Customers, Bank India, Yono Sbi App-Latest News - Telugu

ఏప్రిల్‌ 1,2 తేదీలలో లేదా ఆ తర్వాత కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన పెన్షనర్లు, వారి కుటుంబసభ్యులు, ప్రతినెలా జీతం తీసుకునే కస్టమర్లతోపాటు జీతం లేని వినియోగదారులు కూడా ఈ రుణాన్ని పొందవచ్చు.ఇప్పటికే పాత లోన్‌లు ఉన్న కస్టమర్లకు కూడా ఎస్‌బీఐ ఈ రుణం అందించనుంది.ఈ ప కం కింద రుణం పొందాలనుకునే వినియోగదారులు ఏదైనా ఎస్‌బీఐ బ్రాంచ్‌లలో దరఖాస్తు చేసుకోవచ్చు.

అంతేకాదు, యోనో ఎస్‌బీఐ మొబైల్‌ యాప్‌ ద్వారా ప్రీ అప్రూవ్డ్‌లోన్‌ పొందవచ్చు.ఈ లోన్‌ పొందడానికి ఏ ప్రాసెసింగ్‌ ఫీజు లేకుండా రుణం పొందవచ్చు.అంతేకాదు, ఫోర్‌క్లోజర్‌ ఛార్జీలతోపాటు ప్రీ అప్రూవ్డ్‌ పెనాల్టీ ఛార్జీలను కూడా మినహయిస్తున్నట్లు ఎస్‌బీఐ ప్రకటించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube