అమెరికాలో “ఆటా” ఆధ్వర్యంలో “సయ్యంది పాదం” ...!!!

అమెరికాలో ఉన్న తెలుగు వారి సంక్షేమం, అభివృద్ధి కోసం ఎన్నో తెలుగు సంఘాలు ఏర్పాటు చేయబడ్డాయి.అక్కడి ప్రాంతాల వారిగా ఉన్న తెలుగు వారు తెలుగు సంఘాలను ఏర్పాటు చేసుకుని ఎన్నో కార్యక్రమాలని నిర్వహించుకుంటారు.

 sayyandi Padam Under The Auspices Of ata In America , Sayyandi Padam, Ata, Ameri-TeluguStop.com

అలా ఏర్పాటు చేయబడిందే అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆట ).తెలుగు బాషాభివ్రుద్ది, తెలుగు వారి పిల్లలకు తెలుగు సంప్రదాయాలను తెలియజేసేలా తెలుగు పండుగలను నిర్వహించడం ఇలా ఎన్నో కార్యక్రమాలు ఆటా చేపడుతోంది.అయితే తాజాగా ఆటా తన 17 వ మహాసభలను వైభవంగా నిర్వహించాలని ప్రణాలికలు సిద్దం చేసింది.ఇందులో భాగంగానే.

మీ ఆటకు.మా ఆటా వేదిక అంటూ డ్యాన్స్ పోటీలను నిర్వహించడానికి పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తోంది.

అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఈ మహాసభలలో ఈ డ్యాన్స్ ప్రోగ్రాం హైలెట్ గా నిలవనుందని ఆటా సభ్యులు తెలిపారు.ఈ పోటీలలో క్లాసికల్, నాన్ క్లాసికల్ అనే రెండు విభాగాలు ఉంటాయి.

ఈరెండు విభాగాలలో సోలో, గ్రూప్ డ్యాన్స్ పోటీలు జరుగుతాయి.జులై 1 నుంచీ 3 వ తేదీ వరకూ ఈ పోటీలు ఉండగా చివరి రోజున ఫైనల్ రౌండ్ నిర్వహించనున్నారు.

ఈ డ్యాన్ పోటీలను డల్లాస్, అట్లాంటా , న్యూజెర్సీ, ర్యాలి, వర్జీనియా, నాష్విల్, సియాటిల్, లాస్ ఏంజిల్స్ పోర్ట్ ల్యాండ్, డెట్రాయిడ్, చికాగో వంటి నగరాల్లో నిర్వహించనున్నారు.అయితే ఫైనల్ పోటీలు జరిగే సమయంలో టాలీవుడ్ డ్యాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్ జడ్జి గా వ్యవహరించనున్నారు.

ఈ పోటీలలో పాల్గొనదలచిన వారు ఆడిషన్స్ ఎంట్రీ కోసం క్రింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వాలి.https://www.ataconference.org/events-registrations మరిన్ని వివరాల కోసం – https://www.ataconference.org/

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube