రోడ్డు ప్రమాదానికి గురైన జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ నటుడు సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు ఈ మేరకు అపోలో వైద్యులు శనివారం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.సాయిధరమ్ తేజ్ చికిత్సకు స్పందిస్తున్నారని ఎటువంటి గాయాలు లేవని రక్తస్రావం కూడా లేదని తెలిపారు.
ప్రధాన అవయవాలు బాగానే పనిచేస్తున్నాయని పేర్కొన్నారు రోడ్డును బలంగా గుద్దుకోవడంతో కాలర్ బోన్ గాయమైందని, మిగిలిన గాయాలు ప్రమాదకరమైనవి కావని అంతర్గతంగా ఎలాంటి గాయాలు లేవని వైద్యులు తెలిపారు.కాలర్ బోన్ కి చికిత్స ఆదివారం ఆపరేషన్ చేసే అవకాశం ఉందని తెలిపారు.
ప్రస్తుతానికి ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు.పలువురు ప్రముఖులు తేజ్ ను శనివారం ఉదయం పరామర్శించారు.
చిరంజీవి దంపతులు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆస్పత్రికి వచ్చి పొందుతున్న సాయిధరమ్ తేజ్ చికిత్సపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.వీరేగాక హీరో రామ్ చరణ్ తేజ్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, మంచు లక్ష్మి తదితరులు వచ్చి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
ఆయన ఆరోగ్యంపై వస్తున్న వదంతులను నమ్మవద్దని మంత్రి తలసాని విజ్ఞప్తి చేశారు.శుక్రవారం రాత్రి స్పోర్ట్స్ బైక్ పై ప్రయాణిస్తున్న సాయిధరమ్ తేజ్ ప్రమాదవశాత్తు కింద పడడంతో తీవ్రంగా గాయపడ్డారు.
నిర్లక్ష్యపు, ర్యాష్ డ్రైవింగ్ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. యాక్సిడెంట్ వివరాల్లోకి వెళితే.
అందరికీ తెలిసిందే హీరో సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు స్పోర్ట్స్ బైక్ పై వెళ్తుండగా అదుపు తప్పి కింద పడడంతో ఆయన గాయాలయ్యాయి.హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 నుంచి గచ్చిబౌలి వైపు వస్తుండగా ఐటీ కారిడార్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.
రాయదుర్గం, మాదాపూర్ పోలీసులు ప్రమాదం వివరాలను మీడియాకు వెల్లడించారు.శుక్రవారం రాత్రి సాయిధరమ్ తేజ్ జూబ్లీహిల్స్ నుంచి గచ్చిబౌలి వెళ్లేందుకు స్పోర్ట్స్ బైక్ పై బయలుదేరారు.దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దాటి ఐటీసీ కోహినూర్ హోటల్ ముందు నుంచి ఐకియా వైపు వస్తుండగా బైక్ అదుపు తప్పి కింద పడిపోయారు.దీంతో కంటి భాగం కడుపు చేతిపై గాయాలయ్యాయి వెంటనే కొందరు వాహనదారులు 108 కి సమాచారం ఇచ్చారు.
గాయపడిన తేజ్ ను 108 సిబ్బంది మాదాపూర్ లోని ఆసుపత్రికి తరలించి పోలీసులకు ఫోన్ చేశారు.ఆసుపత్రిలో చేరిన తర్వాత వైద్యులు అతని సాయిధరమ్ తేజ్ గా గుర్తించారు.
పోలీసులు ఆసుపత్రికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు అనంతరం సాయిధరమ్ తేజ్ కు బలమైన గాయాలు కాలేదని వారు వెల్లడించారు.