‘సవ్యసాచి’ వీకెండ్‌ కలెక్షన్స్‌... కాస్త పర్వాలేదు     2018-11-07   12:51:23  IST  Ramesh Palla

నాగచైతన్య, నిధి అగర్వాల్‌ జంటగా చందు మొండేటి దర్శకత్వంలో మైత్రి మూవీస్‌ వారు నిర్మించిన సవ్యసాచి చిత్రం అయిదు రోజుల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొంది విడుదలైన ఈ చిత్రం యావరేజ్‌ టాక్‌ను దక్కించుకుంది. మొదటి రోజు ఒక మోస్తరు వసూళ్లను దక్కించుకున్న సవ్యసాచి ఆ తర్వాత తగ్గుముఖం పట్టింది. అయితే శని, ఆదివారాలు అవ్వడంతో కాస్త గౌరవ ప్రథమైన వసూళ్లను ఈ చిత్రం రాబట్టింది. మొదటి మూడు రోజుల్లో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 7.65 కోట్లను వసూళ్లు చేసినట్లుగా ట్రేడ్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. సోమ వారం కాస్త తగ్గినా కూడా ఆ తర్వాత దీపావళి సెలవులు కారణంగా పెద్ద మొత్తంలో చిత్రం వసూళ్లను రాబడుతున్నట్లుగా తెలుస్తోంది.

Savyasachi Movie Weekend Collections-

Savyasachi Movie Weekend Collections

సవ్యసాచి మొదటి వారాంతం కలెక్షన్స్‌ :
నైజాం : 2.13 కోట్లు
వైజాగ్‌ : 92 లక్షలు
ఈస్ట్‌ : 34 లక్షలు
వెస్ట్‌ : 33 లక్షలు
కృష్ణ : 47 లక్షలు
గుంటూరు : 70 లక్షలు
న్లెూరు : 27 లక్షలు
సీడెడ్‌ : 91 లక్షలు
యూఎస్‌ఏ : 74 లక్షలు
కర్ణాటక : 54 లక్షలు
ఇతరం : 30 లక్షలు
మొత్తం : 7.65 కోట్లు(షేర్‌) (15.2 కోట్ల గ్రాస్‌)