‘సవ్యసాచి’ రెండు రోజుల కలెక్షన్స్‌  

Savyasachi Movie Two Days Collections-

  • అక్కినేని నాగచైతన్య హీరోగా తెరకెక్కిన ‘సవ్యసాచి’ చిత్రం గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. విభిన్నమైన కాన్సెప్ట్‌ అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు మొదటి నుండి ప్రచారం చేస్తూ వచ్చిన కారణంగా సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.

  • ‘సవ్యసాచి’ రెండు రోజుల కలెక్షన్స్‌-Savyasachi Movie Two Days Collections

  • అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రంను చందు మొండేటి చిత్రీకరించాడు అంటూ ప్రచారం చేశారు. మైత్రి మూవీస్‌ వారు ఈ చిత్రంను నిర్మించిన కారణంగా డిస్ట్రిబ్యూటర్లు ఈ చిత్రంను ఏకంగా 22 కోట్లకు కొనుగోలు చేయడం జరిగింది. కాని ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే అంత వసూళ్లు చేయడం అసాధ్యం అని తేలిపోయింది.

  • Savyasachi Movie Two Days Collections-

    సినిమా మొదటి రెజు 4.15 కోట్ల షేర్‌ను రాబట్టిన ఈ చిత్రం రెండవ రోజు 1.5 కోట్లను రాబట్టింది. రెండు రోజులకు కలిపి 5.65 కోట్లను వసూళ్లు చేసిన ఈ చిత్రం శని, ఆది వారాల్లో మరో అయిదు కోట్లను వసూళ్లు చేసే అవకాశం ఉందని సినీ వర్గాల వారు అంటున్నారు. మొత్తంగా ఈ చిత్రం 12 కోట్ల వరకు రాబట్టే అవకాశం ఉందని, అంతకు మించి ఈ చిత్రం వసూళ్లు చేయడం గగనమే అంటూ సినీ వర్గాల వారు మరియు ట్రేడ్‌ వర్గా వారు అంటున్నారు.

    సవ్యసాచి చిత్రం డిస్ట్రిబ్యూటర్లు మొత్తానికి 10 కోట్ల వరకు నష్టపోవడం ఖాయంగా కనిపిస్తుంది. నిర్మాతలు ఇప్పటికే సేఫ్‌ అయ్యారు. ప్రస్తుతం సినిమా ద్వారా నిర్మాతలు లాభాలను దక్కించుకున్నారు.

  • ఇంకా శాటిలైట్‌ రైట్స్‌ మరియు ఇతర రైట్స్‌ ద్వారా మరింతగా లాభాలను దక్కించుకునే అవకాశం ఉంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ‘సవ్యసాచి’ చిత్రం నిరాశ పర్చిందని చెప్పుకోక తప్పదు.

  • ఏదైనా అద్బుతం జరిగితే తప్ప డిస్ట్రిబ్యూటర్లు లాభపడటం అసాధ్యం.