ప్రేమమ్ దర్శకుడు 'సవ్యసాచి'తో చైతూకి మరో హిట్ అందించారా.? స్టోరీ రివ్యూ అండ్ రేటింగ్.!

Movie Title; సవ్యసాచి
Cast & Crew:
న‌టీన‌టులు:అక్కినేని నాగచైతన్య,నిధి అగర్వాల్,మాధవన్,భూమిక,వెన్నెల కిషోర్ తదితరులు
ద‌ర్శ‌క‌త్వం: చందు మొండేటి
నిర్మాత‌:మైత్రి మూవీ మేకర్స్
సంగీతం: ఎం.ఎం.కీరవాణి

 Savyasachi Movie Review-TeluguStop.com

STORY:


కులు (హిమాచల్ ప్రదేశ్) లో జరిగిన బస్సు ఆక్సిడెంట్ తో ఈ సినిమా స్టార్ట్ అవుతుంది.ఆ ఆక్సిడెంట్ లో చావు నుండి తప్పించుకున్న వారిలో ఒకరు విక్రమ్ (నాగ చైతన్య) ఒకరు.

విక్రమ్ యాడ్ ఫిలిమ్స్ చేస్తూ తన అక్క భూమిక కుటుంబంతో పాటే ఉంటుంటాడు.తన కాలేజీ లో చిత్ర (నిధి అగర్వాల్) తో పరిచయం అవుతుంది.మొదట్లో చిత్రను ఏడిపించేవాడు…తర్వాత అదే ప్రేమగా మారుతుంది.ఇంతలో భూమిక కూతురు కిడ్నప్ అవుతుంది.

కిడ్నప్ చేసింది మాధవన్.అతను ఎందుకు కిడ్నప్ చేసాడు.? విక్రమ్ తన అక్క కూతుర్ని ఎలా కాపాడుకున్నాడు అనేది తెలియాలంటే సవ్యసాచి సినిమా చూడాల్సిందే.

REVIEW:


ప్రేమకథా చిత్రాల హీరోగా నిలదొక్కుకున్న నాగచైతన్య.కమర్షియల్ హీరో గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నాడు.నాగచైతన్య కెరీర్‌లో అత్యధిక బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు.

‘కేశవ’, ‘ప్రేమమ్’ వంటి వైవిధ్యమైన సినిమాలను తెరకెక్కించిన చందు మొండేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.‘బాహుబలి’ లాంటి బ్లాక్ బస్టర్ తరవాత ఎం.ఎం.కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించడం మరో విశేషం.ఈ చిత్రం ద్వారా నిధి అగర్వాల్ హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతోంది.అలాగే, ఒకప్పటి లవర్‌బాయ్ మాధవన్ ఈ సినిమాలో నెగిటివ్ రోల్ పోషించారు.భూమిక ముఖ్య పాత్రలో నటించారు.మొత్తంగా చూసుకుంటే ఇదో మల్టీ పవర్ ప్యాక్ట్ మూవీ.

ఈ చిత్రంలో దర్శకుడు చందు మొండేటి వినూత్న కథాంశాన్ని ఎంచుకున్నారు.‘వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్’ అనే వింత వ్యాధిని కథలో భాగం చేశారు.హీరోకు ఈ డిజార్డర్ ఉంటుంది.దీని కారణంగా హీరోకి కోపం వచ్చినా, సంతోషం వచ్చినా అతని ప్రమేయం లేకుండానే ఎడమచేయి స్పందిస్తుంది.

ఈ డిజార్డర్ వల్ల సినిమాలో వినోదం, భావోద్వేగం రెండూ పండాయని ఇప్పటికే చిత్ర నిర్మాతలు వెల్లడించారు.

సినిమా చూసిన వాళ్లు ట్విట్టర్ ద్వారా తమ స్పందనను తెలియజేస్తున్నారు.కథ చాలా బాగుందని, కొత్తగా అనిపించిందని అంటున్నారు.అయితే ఇంత మంచి కథను నెరేట్ చేసిన తీరు పెద్దగా రుచించదట.

ఇంకాస్త ఎంగేజింగ్‌గా సినిమాను తెరకెక్కించి ఉంటే బాగుండు అంటున్నారు.ముఖ్యంగా ఫస్టాఫ్‌లో వచ్చే హీరోహీరోయిన్ల లవ్ స్టోరీ బాగా బోర్ కొట్టిస్తుందట.

సెకండాఫ్‌లో నాగచైతన్య, మాధవన్ మధ్య మైండ్ గేమ్ ఇంకాస్త ఆసక్తికరంగా ఉంటే బాగుండేది అని తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.

Plus points:


స్టోరీ
చైతు నిధి అగర్వాల్ కెమిస్ట్రీ
సాంగ్స్

Minus points:


సెకండ్ హాఫ్
బోరింగ్ సన్నివేశాలు

Final Verdict:


‘సవ్యసాచి’ కథ బాగుంది…కానీ కథను తెరకెక్కించడంలో విఫలమయ్యారు.మొత్తంగా చూసుకుంటే ఇదొక యావరేజ్ మూవీ.

Rating: 2.5/5

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube