సోలో బ్యాటింగ్‌కు దిగుతున్న సవ్యసాచి   Savyasachi Movie Movie Releasing For This Deepavali     2018-10-30   14:38:25  IST  Ramesh P

క్కినేని నాగచైతన్య సరైన సక్సెస్‌ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నాడు. తాజాగా ఈయన మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన శైలజ రెడ్డి అల్లుడు చిత్రాన్ని చేశాడు. భారీ అంచనాల నడుమ రూపొందిన ఆ చిత్రం ఏమాత్రం ఆకట్టుకోలేక పోయింది. భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫ్లాప్‌ అయిన ‘శైలజ రెడ్డి అల్లుడు’ చిత్రం తర్వాత చైతూ ‘సవ్యసాచి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. ఈ వారంలో సవ్యసాచి విడుదలకు సిద్దం అయ్యింది.

దసరాకు విడుదల అయిన ‘అరవింద సమేత’, ‘హలోగురు ప్రేమకోసమే’ చిత్రాల సందడి తగ్గింది. ఆ తర్వాత వారం వచ్చిన చిత్రాలు పెద్దగా ఆకట్టుకోవడంలో విఫలం అయ్యాయి. ప్రస్తుతం తెలుగు బాక్సాఫీస్‌ వద్ద పెద్ద సినిమాల సందడి లేక పోవడంతో పాటు, ఇతర చిత్రాలు కూడా పెద్దవి ఏమీ రావడం లేదు. దాంతో సవ్యసాచి చిత్రం సోలోగా విడుదలకు సిద్దం అవుతుంది. ఈ చిత్రం ఏమాత్రం సక్సెస్‌ టాక్‌ తెచ్చుకున్నా, పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకున్నా కూడా భారీగా వసూళ్లు సాధించడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు చెబుతున్నారు.

Savyasachi Movie Releasing For This Deepavali-

చందు మొండేటి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్‌ వారు నిర్మించారు. ఈమద్య కాలంలో వచ్చిన మైత్రి మూవీస్‌ చిత్రాలు మంచి విజయాలను దక్కించుకున్నాయి. దానికి తోడు చందు మొండేటి మంచి ఫాంలో ఉన్నాడు. అన్ని విషయాలు కూడా సవ్యసాచి చిత్రానికి కలిసి వచ్చేలా ఉన్నాయి. అందుకే సవ్యసాచి చిత్రంతో నాగచైతన్య కెరీర్‌ బెస్ట్‌ సక్సెస్‌ను అందుకోవడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు నమ్మకంగా చెబుతున్నారు. ఈ చిత్రంతో పాటు నాగచైతన్య ‘మజిలి’ అనే చిత్రాన్ని కూడా చేస్తున్న విషయం తెల్సిందే. మజిలి చిత్రంలో సమంతతో రొమాన్స్‌ చేస్తున్న చైతూ సవ్యసాచి చిత్రంలో మాత్రం నిధి అగర్వాల్‌తో కలిసి నటించాడు.