యూట్యూబ్‌లో దుమ్ములేపిన అక్కినేని హీరో  

Savyasachi Hindi Movie Clicks 100M Views, Savyasachi, Akkineni Naga Chaitanya, Youtube, Tollywood News - Telugu Akkineni Naga Chaitanya, Savyasachi, Tollywood News, Youtube

అక్కినేని నాగచైతన్య నటించిన చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అవుతూ వస్తున్నాయి.అక్కినేని వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన చైతూ వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సె్స్ అయ్యాడు.

 Savyasachi Hindi Movie Clicks 100m Views

అయితే గతంలో చైతూ నటించిన ఓ సినిమా ఇప్పుడు అదిరిపోయే రికార్డును క్రియేట్ చేయడంతో ప్రేక్షకులతో పాటు అక్కినేని ఫ్యాన్స్ కూడా అవాక్కయ్యారు.యంగ్ డైరెక్టర్ చందూ ముండేటి తెరకెక్కించిన ‘సవ్యసాచి’ చిత్రం వైవిధ్యమైన కథనంతో తెరకెక్కిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో నాగచైతన్య పర్ఫార్మెన్స్ బాగుండటంతో ప్రేక్షకులు ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు.కానీ ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ కాలేకపోయింది.ఈ సినిమా కథ చాలా కొత్తగా ఉన్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా ఈ సినిమా ఫెయిల్యూర్‌గా మిగిలింది.ఇక ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన సంగతి తెలిసిందే.

యూట్యూబ్‌లో దుమ్ములేపిన అక్కినేని హీరో-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అయితే ఈ సినిమాను హిందీలో డబ్ చేసి యూట్యూబ్‌లో రిలీజ్ చేయగా దీనికి ప్రేక్షకులు అదిరిపోయే రెస్పాన్స్ ఇచ్చారు.ఈ సినిమాకు ఏకంగా 100 మిలియన్ వ్యూస్ రావడంతో ఇప్పుడు ఇది టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

అక్కినేని హీరోల్లో హిందీలో డబ్ చేసిన సినిమాలకు ఇలాంటి అరుదైన రికార్డును క్రియేట్ చేసి అందరినీ మెప్పించాడు నాగచైతన్య.ఇక ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా మాధవన్ విలన్ పాత్రలో నటించాడు.

ఈ సినిమాలోని వైవిధ్యమైన కథ బాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయ్యింది.అటు చైతూ నటించిన మజిలీ సినిమా కూడా బాలీవుడ్‌లో ఏకంగా 60 మిలియన్ వ్యూస్ దక్కించుకుని సత్తా చాటింది.

#Youtube #Savyasachi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Savyasachi Hindi Movie Clicks 100m Views Related Telugu News,Photos/Pics,Images..