హైదరాబాద్ లో "సావిత్రి గారి" ఇల్లు ఎక్కడుందో తెలుసా.? ఎలా ఉందో మీరే చూడండి!       2018-05-27   00:36:23  IST  Raghu V

కళ్లతోనే హావభావాలు పలికించగల అధ్బుతనటి సావిత్రి.అటువంటి నటి గురించి ,ఆవిడ వ్యక్తిత్వం గురించి ఈ తరానికి పరిచయం చేసిన సినిమా మహానటి..మహానటి చూసిన తర్వాత సావిత్రి గారి జీవితం గురించి మరింతగా తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. సావిత్రి జీవితంలో జెమిని పాత్ర,మధ్యం అలవాటుకి బానిసగా మారి చివరికి కోమాలోకి వెళ్లి తర్వాత కన్నుమూశారు.

-

తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన సినీ ధాత్రి సావిత్రి పుట్టింది గుంటూరులో కాగా.. పెరిగింది కృష్ణా జిల్లాలో.. కానీ ఆమె సినీ రంగ ప్రయాణం మొత్తం చైన్నైలోనే సాగింది. కానీ సావిత్రికి హైదరాబాద్ లో ఓ ఇల్లు ఉండేదని చాలా తక్కువమందికి తెలుసు..తెలుగు సినిమాల్లో షూటింగ్ ల కోసం హైదరాబాద్ కు వచ్చే సావిత్రికి నగర వాతావరణంతో పాటు ఇక్కడున్న చెరువులు, బాగ్ లు బాగా నచ్చాయి.

-

దాంతో 1960 దశకంలో హైదరాబాద్ లోని యూసుఫ్ గూడలో ఎకరం భూమి కొని అందులో రెండు భవనాలను నిర్మించారు. ‘షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ వచ్చినప్పుడు సావిత్రి ఈ ఇంట్లోనే ఉండావారట.. బాల్కనీలో కూర్చొని ముందు ఉన్న చెరువు ను చూస్తూ ఎంజాయ్ చేసేదట.. ఇప్పుడా చెరువు కృష్ణకాంత్ పార్క్ గా మారిపోయింది. సావిత్రి ఇల్లు సావిత్రి బావ మల్లికార్జున రావుకు సొంతమైంది. ప్రస్తుతం సావిత్రి ఇల్లు స్థానంలో పెద్ద పెద్ద అపార్ట్ మెంట్లు వెలిశాయి.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.