కామాంధుల కన్ను.. దిశ యాప్ తో యువతి సేవ్..!

ఓ యువతిని కొందరు యువకులు వెంబండిస్తున్నారని సమాచారం అందుకున్న పోలీసులు ఆ యువతిని కాపాడారు.మహిళల రక్షణ కోసం ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘దిశ’ ద్వారా ఓ యువతిని రక్షించారు పోలీసులు.

 Vijayavada, Police, Safe Women-TeluguStop.com

పోలీసులు ఆ యువతిని కాపాడి ఆమె వివరాలు సేకరించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.

విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పని చేసే యువతికి కుటుంబసభ్యులు పెళ్లి సంబంధం చూశారు.పెళ్లి ఇష్టం లేక ఆ యువతి సూసైడ్ చేసుకోవడానికి గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని ఉండవల్లి నుంచి అమరావతి కరకట్ట మార్గంలో స్కూటీపై బయలుదేరింది.

వెంకటపాలెం ఇసుక క్వారీ దగ్గర మద్యం సేవిస్తున్న నలుగురు యువకులు యువతిని ఒంటరిగా బైక్ పై వెళ్తుంది గమనించారు.

దీంతో వాళ్లు కూడా బైకులు వేసుకుని వెంబడించారు.

అది గమనించిన యువతి భయపడి ఫోన్ తీసుకుని దిశ యాప్ ను ఓపెన్ చేసి పోలీసులకు సమాచారం అందించింది.దగ్గర్లో ఉన్న తాడేపల్లి పోలీస్ స్టేషన్ కు సమాచారం అందడంతో పోలీసులు యువతి ఫోన్ లోకేషన్ ఆధారంగా ట్రేస్ అవుట్ చేశారు.

పోలీసులు వస్తున్న విషయం తెలుసుకున్న యువకులు అక్కడి నుంచి పరారయ్యారు.యువతిని సేవ్ చేసి ఆత్మహత్య చేసుకునేందుకు వెంట తెచ్చుకున్న శానిటైజర్ బాటిల్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అనంతరం యువతికి కౌన్సిలింగ్ ఇప్పించి కుటుంబ సభ్యుల దగ్గరికి చేర్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube