బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ  

Saurav Ganguly Has A Bcci President-brijesh Patel,indian Cricket Team,saurav Ganguly

బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా సౌరవ్‌ గంగూలీ ఎన్నిక కాబోతున్నట్లుగా తెలుస్తోంది.టీం ఇండియాకు ఎన్నో అద్బుతమైన విజయాలను అందించిన గంగూలీ ప్రస్తుతం కోల్‌కత్తా క్రికెట్‌ సంఘం అధ్యక్షుడిగా ఉన్నాడు.అన్ని రాష్ట్రాల నుండి కూడా గంగూలీకి మద్దతు లభించిన కారణంగా ఆయన అధ్యక్షుడిగా ఎన్నిక అవ్వడం దాదాపుగా కన్ఫర్మ్‌ అయ్యింది.

Saurav Ganguly Has A Bcci President-brijesh Patel,indian Cricket Team,saurav Ganguly-Saurav Ganguly Has A BCCI President-Brijesh Patel Indian Cricket Team

ఆయన్ను పలు రాష్ట్రాల క్రికెట్‌ కమిటీలు కూడా అధ్యక్షుడిగా ఉండాలని ఆశిస్తున్నాయని బీసీసీఐ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.అందుకే ఆయనకు పదవి కన్ఫర్మ్‌ అంటూ సమాచారం అందుతోంది.మొన్నటి వరకు బ్రిజేష్‌ పటేల్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని అంతా భావించారు.కాని ప్రస్తుతం ఆయన కంటే ఎక్కువగా గంగూలికి మద్దతు ఉంది.ఆ కారణంగానే గంగూలీ బీసీసీఐ కొత్త బాస్‌ అవ్వబోతున్నాడు.బీసీసీఐ అధ్యక్షుడిని ఈసారి ఎన్నికల పద్దతి ద్వారా కాకుండా ఏకగ్రీవం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

Saurav Ganguly Has A Bcci President-brijesh Patel,indian Cricket Team,saurav Ganguly-Saurav Ganguly Has A BCCI President-Brijesh Patel Indian Cricket Team

అందుకు సంబంధించి ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి.గంగూలీకి పోటీ లేకుండా సింగిల్‌గానే పోటీకి దించాలని అంతా భావిస్తున్నారు.పోటీలో ఒక్కడే ఉంటే ఏకగ్రీవం అవుతుంది కనుక ఖచ్చితంగా మరెవ్వరిని పోటీకి రాకుండా చూస్తున్నారు.ఈ నెల చివరి వరకు గంగూలీ క్రికెట్‌ ఆఫ్‌ ఇండియా బాస్‌గా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.