ప్రవాసులకు గుడ్ న్యూస్ చెప్పిన సౌదీ...!!

కరోనా కారణంగా ఎంతో మంది ప్రవాసులు తమ సొంత ప్రాంతాలకు వెళ్లి కరోనా ఆంక్షల నేపధ్యంలో చిక్కుకుపోయారు.ఇలా ఎంతో మంది వివిధ దేశాల వారు ఉద్యోగాలను వదులుకుని, ఆర్ధికంగా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

 Saudi To Extend  Work Permit And Visiting Visa , Visa Permits, Covid Effect, Sau-TeluguStop.com

ముఖ్యంగా వీసా ల రెన్యువల్ గడువు ముగుస్తున్న సమయంలో ప్రవాసులు ఈ విషయంలో తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు.ఈ క్రమంలోనే సౌదీ అరేబియా గుడ్ న్యూస్ చెప్పింది.

కరోన వలన ప్రయాణాలపై ఆంక్షలు విధించిన కారణంగా విదేశాలలో చిక్కుకున్న ప్రవాసుల రెసిడెన్సీ పర్మిట్, విజిట్ వీసాల గడువును పొడిగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.

వర్క్ పర్మిట్ , విజిట్ వీసా పర్మిట్ ల గడువును ఆగస్టు 31 వరకూ పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ విషయాన్ని సౌదీ పాస్ పోర్ట్ జనరల్ ఓ ప్రకటనలో తెలిపింది.అంతేకాదు ఈ రెన్యువల్ కోసం ప్రవాసులు ఎలాంటి అపరాధ రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని కూడా ప్రకటించింది.

అంతేకాకుండా పొడిగించిన ఈ గడువు బయట ఉన్న ప్రవాసుల రెసిడెన్సీ , పర్మిట్ విజిట్ వీసాలకు కూడా వర్తిస్తుందని తెలిపింది.అయితే

Telugu Covid Effect, Residencypermit, Saudi, Saudiextend, Visa Permits-Telugu NR

ప్రవాసులు ఇందుకోసం పాస్ పోర్టు కేంద్రాలకు వెళ్ళాల్సిన అవసరం లేదని కేంద్ర సమాచార శాఖ సహకారంతో ఈ పొడిగింపు దానంత అదే వచ్చేలా చేయడం జరుగుతుందని తెలిపింది.కేవలం కరోనా నేపధ్యంలో చిక్కుకుపోయిన ప్రవాసుల కోసం కింగ్ సల్మాన్ బిన్ అబ్డులాజిజ్ అల్ సౌద్ ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా పాస్ పోర్ట్ జనరల్ డైరెక్టరేట్ మీడియా ప్రకటనలో తెలిపింది.ఆగస్టు 31 వరకూ యూఏఈ లో ప్రవేశం లేదని దేశాలకు చెందిన ప్రవాసులకు రెసిడెన్సీ పర్మిట్ తో పాటుగా వర్క్ పర్మిట్, రీ ఎంట్రీ వీసాలకు కూడా ఈ పొడిగింపు వర్తిస్తుందని డైరెక్టరేట్ వెల్లడించింది.

సౌదీ తాజాగా ప్రకటనతో ఎంతో మంది ప్రవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ముఖ్యంగా భారత ప్రవాసులకు తాజా నిర్ణయం ఎంతో ఊరట నిస్తుందనే చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube