కరోనా తెచ్చిన తంటా..హత్యారోపణతో భారతీయుడు అరెస్ట్..!!

ఎంత పనిచేశావే కరోనా అంటే ఈ మధ్య కాలంలో ఓ కరోనాపై ఓ సాంగ్ వచ్చి సూపర్ డూపర్ హిట్ అయ్యింది.ఈ పాటకి తగ్గట్టుగానే ఉంది సౌదీ లోని ఓ భారతీయుడు పరిస్థితి.

 Saudi, Warangal, Police, Corona Test, Corona Positive Cases-TeluguStop.com

కరోనా ఎంత పనిచేశావే అంటూ ఇప్పుడు నెత్తీ నోరూ కొట్టుకుంటున్నాడు.నేను కావాలని ఈ పనిచేయలేదు ప్లీజ్ వదిలేయండి అంటూ సౌదీ పోలీసులని బ్రతిమిలాడుకుంటున్నాడు.

ఇంతకీ కరోనా ఇతడిని ఎలా బుక్ చేసింది.అసలేం జరిగింది అనే వివరాలలోకి వెళ్తే మీరు తప్పకుండా షాక్ అవుతారు.

ప్రపంచాన్ని కంగారు పెట్టిస్తున్న కరోనా సౌదీ ని కూడా ఓ ఊపు ఊపేస్తోంది.ఇప్పటి వరకూ సౌదీలో సుమారు 2,900 మందికి కరోనా సోకగా 41 మంది మృతి చెందారు.

దాంతో సౌదీ సర్కార్ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది.అసలే సౌదీ రూల్స్ కరోనా నేపధ్యంలో వీటిని మరీ ఎక్కువగా పెంచేశారు దాంతో బహిరంగ ప్రదేశాలలో ఉమ్మి వేస్తే కటినమైన శిక్షలు విదిస్తాయని ప్రకటించారు.ఈ క్రమంలోనే

Telugu Corona, Saudi, Warangal-

సౌదీ లో వరంగల్ జిల్లాకి చెందిన ఓ యువకుడు అక్కడి సూపర్ మార్కెట్ కి వెళ్ళాడు.అతడి ఖర్మ కాలి ఒక్క సారిగా తుమ్మాడు, అక్కడితే ఆగకుండా చేతితో సామాన్లు ముట్టుకున్నాడు.ఇది చూసిన బాలిక పరుగు పరుగున స్టోర్ వాళ్లకి కాల్ చేసి పోలీసులని పిలిపించింది.అతడిని విచారణా చేసిన పోలీసులు అరెస్ట్ చేసి అతడి సాంపిల్స్ టెస్ట్ కి పంపగా కరోనా పాజిటివ్ అని తేలింది దాంతో అతడిపై హత్య నేరం కింద కేసులు పెట్టి అరెస్ట్ చేసి ఆసుపత్రికి తరలించారు.

కరోనా ఉందని తెలిస్తే హాస్పటల్ కి వెళ్ళే వాడినని, పొరబాటున జరిగిన పని కాబట్టి వదిలేయమని ఎంత వేడుకున్నా అస్సలు కనికరించలేదని బోరుమంటున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube