వివాహం విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్న సౌదీ.. !

ప్రపంచంలో పెళ్లిల విషయంలో అమ్మాయి, అబ్బాయి నచ్చితే చాలు.దేశం, మతం ఏదైనా వివాహం చేసుకోవచ్చూ.

 Saudi Makes Sensational Decision In Marriage-TeluguStop.com

ఇలా ఎందరో తమ దేశాలవారిని కాకుండా ఇతర దేశస్తులను వివాహలు చేసుకున్నారు.ఈ విషయంలో ఏ దేశ ప్రభుత్వం కూడా అభ్యంతరం తెలుపదు.

కానీ సౌదీ ఆరేబియా మాత్రం ఇతర దేశాల మహిళలను వివాహం చేసుకునే విషయంలో తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది.

 Saudi Makes Sensational Decision In Marriage-వివాహం విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్న సౌదీ.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ముఖ్యంగా పాకిస్థాన్, బంగ్లాదేశ్, చాద్, మాయన్మార్‌కి చెందిన మహిళలను అసలే వివాహం చేసుకోవద్దని ఈ దేశం ప్రకటించిన ఉత్తర్వుల్లో పేర్కొన్నట్టు పాక్ పత్రిక డాన్ వెల్లడించింది.

కాగా ఈ తాజా ఆదేశాల ప్రకారం ఈ దేశాల మహిళల్ని పెళ్లి చేసుకోవాడానికి కఠిన నిబంధనలు అడ్డొస్తాయని మక్కా పోలీస్ డైరెక్టర్ మేజర్ జనరల్ అసఫ్ అల్-ఖురేషీ అన్నట్టు మక్కా డైలీ పేర్కొందట.

ఇక ఇప్పటి వరకు సుమారుగా 5 లక్షల మంది మహిళలు ఈ నాలుగు దేశాలకు చెందిన వారు సౌదీ అరేబియాలో ఉంటున్నారట.

అయితే ఈ దేశంలో రోజు రోజుకు విదేశీ మహిళల్ని పెళ్లి చేసుకునేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతుండటంతో సౌదీ ఆరేబియా ప్రభుత్వం ఈ కఠిన నిబంధనలను విధించినట్లు సమాచారం.

#Marriage #Chad #Pakistan #Bangladesh #Saudi

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు