ప్రవాస విద్యార్ధులకు సౌదీ గుడ్ న్యూస్...ఇకపై...!!

Saudi Arabia New Easier Visa Norms,Saudi Arabia,Student Visa,Saudi Government,Indian Students,Sponsorship,Visitor Visa

విదేశాలలో విద్య కోసం ఎంతో మంది విద్యార్ధులు వారి దేశాలను విడిచి ఇతర దేశాలకు ఉన్నత చదువులు కోసం వలసలు వెళ్తుంటారు.ముఖ్యంగా అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియాలకు విదేశీ విద్యార్ధుల తాకిడి ఎక్కువగా ఉంటుంది.

 Saudi Arabia New Easier Visa Norms,saudi Arabia,student Visa,saudi Government,in-TeluguStop.com

అంతేకాదు విద్యార్ధులను ఆకర్షించే క్రమంలో వారికి ఎన్నో రాయితీలు, మినహాయింపులు వగైరా వగైరా ఆశలు చూపిస్తూ ఉంటారు.ప్రస్తుతం అరబ్బు దేశమైన సౌదీ అరేబియా కూడా ఈ పద్ధతినే ఫాలో అవుతోంది.

తమ దేశంలోకి విదేశీ విద్యార్ధులను ఆకర్షించేందుకు గాను సౌదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు విదేశీ విద్యార్ధులకు గుడ్ న్యూస్ ప్రకటించింది.

ఇకపై తమ దేశంలో చదువుకునే విద్యార్ధులు ఎవరికైనా సరే స్పాన్సర్ షిప్ అవసరం లేదని ప్రకటించింది.త్వరలో విద్యా విధానంలో సరికొత్త వీసాలను అందిస్తామని తెలిపింది.విదేశీ విద్యార్ధులు, పరిశోధకులు, నిపుణులకు ఈ వీసాలను అందివ్వనున్నారట.అలాగే సౌదీలో విద్యా ప్రమాణాలను పెంచేందుకు గాను కొత్త వీసాల జారీలో ప్రాధాన్యత ను ఇస్తున్నట్టుగా తెలిపింది ప్రభుత్వం.

ఈ కొత్త విధానానికి సౌదీ మంత్రి మండలి కూడా ఆమోదం తెలిపింది.కింగ్ సల్మాన్ అధ్యక్షతన మంత్రి మండలి ఆమోద ముద్ర వేసింది.ఇదిలాఉంటే

Telugu Indian, Saudi Arabia, Saudi, Sponsorship, Visa-Telugu NRI

స్వల్ప కాలిక వ్యవధిలో విద్యార్ధులు, విజిటర్ ట్రైనీ లకు, బాషా నిపుణులకు, శిక్షణ నిపుణులకు, విద్యార్ధుల ప్రయోజనాల కోసం ఈ వీసాలు జారీ చేస్తారట.ఈ నిర్ణయం కాంట్రాక్ట్ నిభంధనలను బలోపేతం చేస్తుందని గతంలో ప్రవేశ పెట్టిన ఈ స్పాన్సర్ ఆమోదాన్ని తాజాగా రద్దు చేయడంతో ఎంతో మంది ప్రవాసీయులు, ముఖ్యంగా విద్యార్ధులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇదిలాఉంటే ఈ నిర్ణయం వలన అత్యధికంగా లాభపడేది మాత్రం భారతీయులేనట ఎందుకంటే ఏ దేశంలోనైనా సరే విదేశీ నిపుణులు, విద్యార్ధులు అత్యధికంగా ఉన్నారంటే వారిలో సింహ భాగం భారతీయులదేనని, సౌదీలో కూడా ఎంతో మంది భారతీయ విద్యార్ధులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారని అలాంటి వారికి ఈ నిర్ణయం ఎంతో ఉపయోగపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు నిపుణులు.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube