కీలక టైం లో భారత్ కి బిగ్ హెల్ప్ చేసిన సౌదీ అరేబియా..!!

ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ సృష్టిస్తున్న సునామి కి భారత్ అతలాకుతలమౌతున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలు అండగా నిలుస్తున్నాయి.దేశంలో వైద్యం కొరత ఏర్పడే పరిస్థితికి పరిణామాలు దాపూరించడంతో  పాటు కరోనా చికిత్స లో కీలకమైన ఆక్సిజన్ కొరత ఏర్పడటంతో పలు దేశాలు భారత్ కి హెల్ప్ చేయడానికి ముందుకు వస్తున్నాయి.

 Saudi Arabia Has Been A Big Help To India At A Crucial Time  Saudi Arabia, India-TeluguStop.com

దీనిలో భాగంగా సౌదీ అరేబియా ప్రభుత్వం ఇండియాకు 80 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ పంపిస్తూ క్లిష్ట సమయంలో బిగ్ హెల్ప్ చేసింది.

ఈ విషయాన్ని స్వయంగా రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది.

అదాని గ్రూప్ లిండే కంపెనీ ద్వారా పంపుతున్నట్లు స్పష్టం చేసింది.సముద్ర మార్గం ద్వారా దమ్మామ్‌ నుంచి ముంద్రా పోర్టుకు ఆక్సిజన్ ట్యాంకర్లు వస్తున్నట్లు సౌదీ ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఒక్క సౌదీ మాత్రమే కాక యూరప్ లోని చాలా దేశాలు అదేవిధంగా భారత పొరుగు దేశం పాకిస్తాన్ కూడా భారత్ కి అండగా నిలబడటానికి ఆక్సిజన్ అందించడానికి ముందుకు వస్తున్నాయి.ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం, తక్కువ భూభాగంలో ఎక్కువ జనాభా కలిగిన దేశం కావటంతో ఇండియాలో వైరస్ భయంకరంగా విస్తరిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కరోనా సెకండ్ వేవ్ గురించి కథనాలు ప్రసారం చేస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube