సౌదీలో విషాద ఘటన....ఐదుగురు భారత ఎన్నారైలు మృతి

సౌదీలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో భారత సంతతికి చెందిన ఐదుగురు చనిపోయిన ఘటన తీవ్రంగా కలిచివేస్తోంది.చనిపోయిన వారిలో ఇద్దరు పెద్ద వారు ఉండగా.

 Saudi Arabia: Five Indians Of Same Family Killed In Car Crash,saudi Arabia, Kera-TeluguStop.com

మిగిలిన వారిలో కనీసం 10 ఏళ్ళు కూడా దాటని ముగ్గురు పిల్లలు ఉండటం అందరినీ కంటతడి పెట్టిస్తోంది.స్థానికంగా ఉన్న కుటుంబ సభ్యులు ఈ ఘటనపై ఒక్క సారిగా షాక్ కి లోనయ్యారు.

వీరి ఐదుగురి మృత దేహాలను భారత్ లోని వారి స్వ రాష్ట్రానికి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు.వివరాలలోకి వెళ్తే.

కేరళలోని కోజీకోడ్ జిల్లా బై పోర్ కు చెందిన జబ్బీర్ కుటుంబం ఎన్నో ఏళ్ళ క్రితమే సౌదీ వచ్చి స్థిరపడ్డారు.ఆర్ధికంగా నిలదొక్కుకున్న జబ్బీర్ తాను పనిచేస్తున్న కంపెనీలో ఉన్నత పదవిలో ఉన్నాడు.

ఇటీవల తాను పనిచేస్తున్న జుబై ప్రాంతం నుంచి జిజాన్ ప్రాంతానికి బదిలీ అయ్యాడు.దాంతో ఇల్లు మొత్తం సర్ధుకుని ఓ ట్రక్కు మాట్లాడుకుని జిజాన్.

తన భార్య షబ్నం, పిల్లలతో పాటు డిసెంబర్ 4 వ తేదీన బయలుదేరాడు.అయితే

లగేజీ తో ఉన్న ట్రక్ జిజాన్ లోని కొత్త ఇంటికి వెళ్ళిపోయింది.

కానీ జబ్బీర్ కుటుంబం ఎంతకీ రాకపోవడంతో పాటు.ఫోన్ చేస్తున్నప్పటికీ ఎలాంటి స్పందన లేకపోవడంతో వారు స్థానికంగా ఉన్న ఎన్నారైలకు వారి కుటుంబ సభ్యులకు విషయాన్ని తెలిపారు.

జుబై ప్రాంతం నుంచి జిజాన్ మార్గంలో రోడ్డు ప్రమాద ఘటన తెలుసుకుని అందరూ వెళ్లి చూడగా  జబ్బీర్ కుటుంబం మొత్తం మృతి చెంది ఉండటంతో ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.జబ్బీర్, ఆయన భార్య షబ్నం , పిల్లలు లైబా (7 ),సాహా (5), లుఫ్తీ (3) ప్రమాద స్థలంలోనే మృతి చెందారని.

జబ్బీర్ వేగంగా కారును నడుపుతూ మరొక కారును ఢీ కొట్టడంతో ఈ ఘోరం జరిగిందని విచారణలో పోలీసులు తెలిపారు.వీరి మృతదేహాలను సొంత రాష్ట్రం కేరళ తరలించేందుకు స్థానిక ఎన్నారై సంఘాలు కృషి చేస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube