కరోనా నేపథ్యంలో భారత్‌పై నిషేదం విధించిన సౌదీ

ప్రపంచంలో కరోనా కేసులు అత్యధికంగా నమోదు అవుతున్న దేశాల్లో భారత్‌ ముందు వరుసలో ఉంది.ఆ కారణంగా భారతీయులు అంటేనే ప్రపపంచ దేశాలు భయపడుతున్నాయి.

 Saudi Arabia Ban Travel From India, Saudi Arabia, India, Coronavirus, Brazil, Ar-TeluguStop.com

ఆ దేశం వారు ఎక్కడ వచ్చి మాదేశంలో కరోనా కేసులను పెంచుతారో అనే ఆందోళనతో పలు దేశాలు ఉన్నాయి.ఈ నేపథ్యంలోనే పలు దేశాలకు సంబంధించిన ప్రభుత్వాలు భారత ప్రయాణికులను తమ దేశానికి ప్రయాణించేందుకు అనుమతులు ఇవ్వడం లేదు.

ఇండియా నుండి సౌదీ అరేబియాకు ఎక్కువగా జనాలు రాకపోకలు నిర్వహిస్తూ ఉంటారు.భారత్‌ లో పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా సౌదీ తాత్కాలిక నిషేదం విధించింది.

తమ దేశంలో కరోనా కట్టడి కోసం ఇతర దేశాల నుండి వచ్చే ప్రయాణికులను నియంత్రించాలనే నిర్ణయానికి వచ్చాం అంటూ సౌదీ అధికారికంగా ప్రకటించింది.ఇండియాతో పాటు బ్రెజిల్‌.

అర్జెంటీనా విమాన ప్రయాణాలు కూడా నిషేదించినట్లుగా పేర్కొన్నారు.ఈ దేశాల నుండి సాదారణ కార్యకలాపాలపై వచ్చే వారిపై మాత్రమే ఈ నిషేదం ఉంటుంది.

అధికారిక కార్యక్రమాల కోసం వచ్చే వారికి మాత్రం ఈ నిషేదం వర్తించదు అంటూ ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.ఈ నిషేదం ఎప్పటి వరకు అనేది అందులో పేర్కొనలేదు.

వ్యాక్సిన్‌ వచ్చే వరకు ఈ నిషేదం కొనసాగనుందా లేదంటే కొన్నాళ్ల తర్వాత ఎత్తి వేస్తారా అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube