కట్టప్ప.. ఆ రెమ్యునరేషన్ ఏందప్ప?

తెలుగు సినిమాల్లో హీరోహీరోయిన్లకు ఎంతటి ప్రాముఖ్యత ఉంటుందో అలాంటి ప్రాముఖ్యత ఉన్న పాత్ర కూడా ఒకటి ఉంటుంది.సైడ్ క్యారెక్టర్ అయినప్పటికీ ఆ పాత్రకు జనం ఇంప్రెస్ అవుతుంటారు.

 Satyaraj Remuneration In Baahubali Range-TeluguStop.com

అలాంటి పాత్రలు చేసి తమపేరును చిరస్థాయిగా నిలబెట్టుకోవాలని చూస్తుంటారు.కాగా బాహుబలి సినిమాలోని కట్టప్ప పాత్రలో నటించిన సత్యరాజ్ అంతకుముందే పలు సినిమాల్లో చేసినా, బాహుబలి సినిమాతో వచ్చిన క్రేజ్ మాత్రం పీక్స్‌కు చేరుకుంది.

ఇక బాహుబలి సినిమా తరువాత కట్టప్పగానే ఎక్కువ పేరు సంపాదించిన సత్యరాజ్ ప్రస్తుతం వరుసబెట్టి తెలుగు, తమిళ సినిమాల్లో తండ్రి, తాత పాత్రలు చేస్తూ మెప్పిస్తున్నారు.కాగా ఆయన ఒక్క సినిమాకు దాదాపు 2.5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.తమిళంలో అయితే ఆయనే స్వయంగా డబ్బింగ్ కూడా చేప్పుకుంటాడు.

కానీ తెలుగులో సత్యారజ్ పాత్రకు వేరొకరితో డబ్బింగ్ చెప్పిస్తారు.దానికి అదనంగా మరో 25 లక్షల ఖర్చవుతుంది.

మొత్తానికి సత్యారజ్ తెలుగు, తమిళ సినిమాల్లో తనదైన ముద్ర వేస్తూనే రెమ్యునరేషన్‌లో మిగతా క్యారెక్టర్ ఆర్టి్స్టులకంటే స్పీడుగా దూసుకెళ్తున్నారు.తాజాగా సత్యరాజ్ నటించిన ప్రతిరోజూ పండగే సినిమాలో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తోండగా మారుతి డైరెక్ట్ చేస్తున్నాడు.

ఈ సినిమాను డిసెంబర్ 20న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యారు.మరి ఈ సినిమాలో సత్యరాజ్ పాత్ర సినిమాకు ఎంతవరకు హెల్ప్ చేస్తుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube