జాతీయ నినాదం స‌త్య‌మేవ జ‌య‌తేకు ఆధారం, అర్థం ఏమిటో తెలుసా?

దేశంలోని జాతీయ చిహ్నాల గురించి మనకు తెలుసు.మన జాతీయ పతాకం త్రివర్ణం, జాతీయ గీతం ‘జన గణ మన…’, జాతీయ గేయం ‘వందేమాతరం’ జాతీయ జంతువు పులి, జాతీయ పక్షి నెమలి, జాతీయ పుష్పం కమలం.

 Satyamev Jayate Slogan Origin And Meaning Details, People India People, Satyamev-TeluguStop.com

ఇదే 1విధంగా మన జాతీయ చిహ్నం అశోక స్తంభం.ఈ జాతీయ చిహ్నాన్ని సారనాథ్ వద్ద అశోక చక్రవర్తి నిర్మించిన స్తంభం నుండి స్వీకరించారు.1950 జనవరి 26న దేశంలో రాజ్యాంగం అమల్లోకి రావడంతో ఈ జాతీయ చిహ్నాలు ఆమోదం పొందాయి.అయితే అశోక స్తంభంపై ‘సత్యమేవ జయతే’ అని రాసి ఉంటుంది.

అయితే ఈ నినాదం ఎక్కడ నుంచి తీసుకున్నారనే సందేహం మీకు ఈ పాటికే వచ్చివుంటుంది.

పోలీసుల నుండి సైన్యం వరకు.

వారి దుస్తులు, పతకాలలో, జాతీయ, రాష్ట్ర భవనాలపై, నాణేలు, నోట్లలో, ప్రభుత్వ పత్రాలపై, పాస్‌పోర్ట్‌లు, జాతీయ గుర్తింపు ఉన్న ఇతర పత్రాలపై అశోక స్తంభం గుర్తు కనిపిస్తుంది.జాతీయ చిహ్నంలోని ఈ స్తంభంపై నాలుగు సింహాలు ఉంటాయి.

అయితే ముందు నుండి మూడు సింహాలు మాత్రమే కనిపిస్తాయి.‘సత్యమేవ జయతే’ను భారతదేశ ‘జాతీయ నినాదం’గా పరిగణిస్తారు.

దీని అర్థం ‘సత్యం మాత్రమే గెలుస్తుంది’.

‘సత్యమేవ జయతే’ నినాదాన్ని జాతీయ బోర్డులోకి తీసుకురావడంలోనూ, ప్రచారం చేయడంలోనూ పండిట్ మదన్ మోహన్ మాలవ్య కీలక పాత్ర పోషించారు.సత్యమేవ జయతే సూత్రం ముండక ఉపనిషత్తు నుండి గ్రహించారు. ‘సత్యమేవ జయతే’ అనే పదాన్ని జాతీయ చిహ్నంలో నినాదంగా చేర్చారు.

దీనిని వ్యక్తిగతంగా ఉపయోగించలేరు.భారతీయ నోట్లు, నాణేలపై జాతీయ చిహ్నం అశోక స్తంభంతో పాటు ఈ నినాదం కూడా కనిపిస్తుంది.

Satyamev Jayate origin and Meaning in National Emblem

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube