సత్యాగ్రహి ఫస్ట్‌లుక్ టాక్.. అదరగొట్టిన పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కేవలం యాక్టర్‌గా మాత్రమే కాకుండా గతంలో డైరెక్టర్‌గా, ఫైట్ కొరియోగ్రాఫర్‌గా సినిమాలు చేసి మెప్పించిన సంగతి తెలిసిందే.అయితే గతంలో ఆయన సత్యాగ్రహి అనే సినిమాను తెరకెక్కించాలని అనుకున్నారు.

 Satyagrahi Movie First Look Released-TeluguStop.com

కానీ కొన్ని కారణాల వల్ల అది నిజం కాలేదు.కాగా నేడు నూతన సంవత్సరం సందర్భంగా సత్యాగ్రహి ఫస్ట్ లుక్ పోస్టర్‌ కూడా వచ్చేసి పవన్ ఫ్యాన్స్‌ను అవాక్కుచేసింది.

పవన్ కళ్యాణ్ పోస్టర్‌ను బ్యాక్‌గ్రౌండ్‌లో పెట్టిన నలుగురు అభిమానులు నటిస్తోన్న చిత్రంగా సత్యాగ్రహి తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది.కాగా పవన్ తెరకెక్కించాలనుకున్న సత్యాగ్రహి టైటిల్‌ను వారు వాడుకున్నారు.

పవన్ కళ్యాణ్ సిద్ధాంతాల స్ఫూర్తితో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు చిత్ర దర్శకనిర్మాతలు తెలిపారు.నలుగురు పవన్ అభిమానులు సమాజాన్ని మార్చే బాధ్యతను తీసుకుని పవన్ అడుగుజాడలలో ప్రజల్లోకి చైతన్యం తీసుకెళ్లే కథగా ఈ సినిమా రూపొందుతున్నట్లు వారు తెలిపారు.

Telugu Poster, Janasena, Pawan Kalyan, Satyagrahi-

ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకున్న ఈ సినిమాకు కృష్ణచైతన్య దర్శకత్వం వహిస్తుండగా, శ్రీభవిత క్రియేషన్స్‌ పతాకంపై గంగారెడ్డి నిర్మిస్తున్నారు.ఈ సినిమాను అతిత్వరలో ప్రేక్షకులు మందుకు తీసుకువచ్చేందుకు దర్శకనిర్మాతలు ప్రయత్నిస్తున్నారు.మరి పవన్ టైటిల్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube