తమన్నాతో ఆగిపోలేదంటోన్న బ్లఫ్ మాస్టర్  

Satyadev Tamanna Movie Not Shelved, Satyadev, Tamanna, Love Mocktail, Tollywood News, Gopichandh, Love Mactail, Nagashekar - Telugu Gopichandh, Love Mactail, Love Mocktail, Nagashekar, Satyadev, Satyadev Tamanna Movie Not Shelved, Tamanna, Tollywood News

మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.స్టార్ హీరోయిన్ స్టేటస్‌ను ఎంజాయ్ చేస్తూనే అమ్మడు ఎంచుకునే కథలు ఆమెకు ప్రత్యేక గుర్తింపును తీసుకొస్తున్నాయి.

TeluguStop.com - Satyadev Tamanna Movie Not Shelved

ఈ క్రమంలో మ్యాచో స్టార్ గోపీచంద్ సరసన సీటీమార్ చిత్రంలో నటిస్తున్న తమన్నా, విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న సత్యదేవ్‌తో కలిసి ఓ సినిమా చేసేందుకు రెడీ అయ్యింది.కన్నడ సూపర్ హిట్ మూవీ ‘లవ్ మాక్‌టెయిల్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఈ సినిమాకు ‘గుర్తుందా శీతాకాలం’ అనే టైటిల్‌ను కూడా నిర్ణయించింది చిత్ర యూనిట్.అయితే ఈ సినిమా షూటింగ్ మొదలుకాకముందే ఆగిపోయినట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

TeluguStop.com - తమన్నాతో ఆగిపోలేదంటోన్న బ్లఫ్ మాస్టర్-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

దీనికి కారణం సత్యదేవ్ వేరొక చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా ఆ సినిమా షూటింగ్‌ను కూడా మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.అయితే ఈ వార్తలపై సత్యదేవ్ స్పందించాడు.

తమన్నాతో చేయబోయే సినిమా ఆగిపోలేదని ఆయన వెల్లడించాడు.ఈ సినిమాను అతి త్వరలో ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నట్లు ఆయన పేర్కొన్నాడు.

నాగశేఖర్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తూ ప్రొడ్యూస్ చేస్తుండగా కాలభైరవ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.ఈ సినిమాలో తమన్నా పాత్ర చాలా వైవిధ్యంగా ఉండనుందని, ఆమెతో నటించేందుకు తాను ఎదురుచూస్తున్నానని సత్యదేవ్ చెప్పుకొచ్చాడు.

మొత్తానికి తమన్నా లాంటి స్టార్ బ్యూటీతో సినిమా చేసే ఛాన్స్ కొట్టేసిన సత్యదేవ్, వేరొక సినిమా కోసం ఈ అవకాశాన్ని ఎందుకు వదులుకుంటాడా అనే అంశం సినీ వర్గాల్లో వినిపిస్తోంది.మరి ఈ సినిమాను చిత్ర యూనిట్ ఎప్పుడు ప్రారంభిస్తుందా అనేది చూడాలి.

ఇక తమన్నా ఇటీవల కరోనాను జయించిన సంగతి అందరికీ తెలిసిందే.మరి తమన్నా తిరగి సినిమా షూటింగ్‌లలో ఎప్పుడు జాయిన్ అవుతుందా అనే అంశం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

#Love Mactail #Nagashekar #Tamanna #Gopichandh #SatyadevTamanna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Satyadev Tamanna Movie Not Shelved Related Telugu News,Photos/Pics,Images..