క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లోకి అడుగుపెట్టి ఒక్కో మెట్టు ఎక్కుతూ ప్రస్తుతం హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న నటుడు సత్యదేవ్.ఉమామహేశ్వర ఉగ్రరూపస్యః సినిమాతో సత్యదేవ్ సాలిడ్ హిట్ ని తన ఖాతాలో వేసుకొని ప్రస్తుతం ఏకంగా మూడు సినిమాలు హీరోగా చేస్తున్నాడు.
మరో వైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా బిజీ అవుతున్నాడు.టాలీవుడ్ లో గత ఏడాది లాక్ డౌన్ టైంలో కూడా ఏకంగా నాలుగు సినిమాలు సత్యదేవ్ నుంచి ప్రేక్షకుల ముందుకి వచ్చాయి.
ఇవన్నీ కూడా మంచి టాక్ తెచ్చుకున్నాయి.ఇక కోలీవుడ్ లోకి కూడా ఇప్పటికే సత్యదేవ్ ఎంట్రీ ఇచ్చి సినిమాలు చేస్తున్నాడు.
ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ ఆఫర్ ను ఈ యువ హీరో అందుకోవడం విశేషం.ఇప్పటికే మన వాళ్ళు చాలా మంది హిందీలో కూడా మంచి సినిమాలు చేస్తున్నాడు.
ఈ నేపధ్యంలో సత్యదేవ్ ఇప్పుడు హిందీలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ లో భాగంయ్యాడు.
అక్షయ్ కుమార్ హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా రామ్ సేతు.
ఈ సినిమాలో అక్షయ్ సైంటిస్ట్ గా నటిస్తున్నాడు.ఇండియన్ హిందూ మైథలాజికల్ ఎలిమెంట్ ని టచ్ చేస్తూ ఈ సినిమా కథాంశం ఉంటుందని టాక్ వినిపిస్తుంది.
ఇప్పటికే సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్ కూడా వచ్చింది.భారీ బడ్జెట్ తో అభిషేక్ శర్మ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.
అక్షయ్ కుమార్ కి జోడీగా జాక్వలిన్ ఫెర్నాండెజ్ ఈ సినిమాలో నటిస్తుంది.ఇందులో కీలక పాత్ర కోసం ఇప్పుడు టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ సత్యదేవ్ ని ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది
.