నితిన్ పవర్ పేటలోకి వస్తున్న సత్యదేవ్  

Satyadev Play Key role in Nithin Power peta Movie, Tollywood, Telugu Cinema, South Cinema, Keerthi Suresh - Telugu Keerthi Suresh, Satyadev Play Key Role In Nithin Power Peta Movie, South Cinema, Telugu Cinema, Tollywood

యంగ్ హీరో నితిన్ ఈ ఏడాది కెరియర్ లో ఎన్నడూ లేని విధంగా ఏకంగా నాలుగు సినిమాలని లైన్ లో పెట్టాడు.అందులో రంగ్ దే సినిమా ప్రస్తుతం సెట్స్ పైన ఉంది.

 Satyadev Nithin Power Peta

ఇక ఈ ఏడాది ఆఖరిలో గాని వచ్చే ఏడాది గాని కృష్ణ చైతన్య దర్శకత్వంలో మాస్ ఎంటర్టైనర్ గా పవర్ పేట సిరిస్ ని తెరకెక్కించబోతున్నాడు.దీనికి సంబందించిన వర్క్ కూడా ప్రస్తుతం జరుగుతుంది.

ఈ సినిమాలో కూడా హీరోయిన్ గా కీర్తి సురేష్ ని ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది.నితిన్ చాలా గ్యాప్ తర్వాత మరోసారి చేస్తున్న మాస్ ఎంటర్టైనర్ కావడంతో ఏ మాత్రం తేడా కొట్టకుండా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడు.

నితిన్ పవర్ పేటలోకి వస్తున్న సత్యదేవ్-Movie-Telugu Tollywood Photo Image

తాజాగా ఈ సినిమా నుండి లేటెస్ట్ అప్డేట్ బయటకి వచ్చింది.ఈ సినిమాలో నితిన్ తో పాటు మరో హీరో కూడా నటించబోతున్నాడు.అతను సత్యదేవ్ అని తెలుస్తుంది.ఈ మధ్య కాలంలో వరుస సినిమాలతో మంచి నటుడుగా గుర్తింపు పెంచుకున్న సత్యదేవ్ కి ఇందులో నితిన్ తో సమానమైన పాత్రని దర్శకుడు కృష్ణ చైతన్య డిజైన్ చేసినట్లు తెలుస్తుంది.

ఇప్పటికే ఈ క్యారెక్టర్ గురించి సత్యదేవ్ తో చర్చించడం జరిగిందని, అతను కూడా ఒప్పుకున్నాడు అని తెలుస్తుంది.అయితే అఫీషియల్ గా చిత్ర యూనిట్ ప్రకటించే వరకు సినిమాలో ఎవరు నటిస్తున్నారు అనేది సస్పెన్స్ గానే ఉంటుంది.

#Keerthi Suresh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Satyadev Nithin Power Peta Related Telugu News,Photos/Pics,Images..