తన సినిమాలో హీరో వేరే అంటోన్న సత్యదేవ్

టాలీవుడ్‌లో విలక్షణ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న హీరో సత్యదేవ్, చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు.ఇటీవల ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ అనే సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ హీరో ఇప్పుడు తన నెక్ట్స్ చిత్రాలను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.

 Satyadev On Tamannaah Role In Gurtunda Seethakalam, Satyadev, Tamannaah, Gurtund-TeluguStop.com

ఈ క్రమంలోనే ఆయన నటిస్తున్న ‘గుర్తుందా శీతాకాలం’ అనే సినిమా ప్రస్తుతం ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేస్తోంది.
ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా ఫీమేల్ లీడ్‌లో నటిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

ఇక ఈ సినిమాలో తమన్నా పాత్ర చాలా కీలకంగా ఉండబోతుందని, నిజానికి ఈ సినిమాలో హీరో తమన్నానే అంటున్నాడు సత్యదేవ్.ఇటీవల కరోనా బారిన పడిన తమ్మూ, మహమ్మారిని జయించి ఇలా సినిమా షూటింగ్‌లో పాల్గొనడం నిజంగా అభినందనీయమని ఆయన అంటున్నాడు.

ఇక కరోనా సమయంలో ఎన్నో కథలు విన్నా కూడా తనకు పెద్దగా నచ్చలేదని, కానీ ఈ సినిమా కథ వినగానే వెంటనే ఒప్పుకున్నట్లు ఆయన తెలిపాడు.
కాగా ఈ సినిమాలో సత్యదేవ్‌ను డామినేట్ చేస్తూ తమన్నా చేయబోయే పర్ఫార్మెన్స్ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటుందని చిత్ర యూనిట్ అంటోంది.

ఇక ఈ సినిమాలో మేఘా ఆకాష్, నవ్యా శెట్టిలు కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.కాగా తమన్నా ఇటీవల ‘11th అవర్’ అనే వెబ్ సిరీస్‌లో తనకు సంబంధించిన షూటింగ్‌ను ముగించేసిన సంగతి తెలిసిందే.

దీంతో పాటు గోపీచంద్‌తో కలిసి సీటీమార్ చిత్రంలో కూడా తమ్మూ పాప నటిస్తోంది.మరి గుర్తుందా శీతాకాలం చిత్రంలో తమన్నా ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తుందో తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

ఏదేమైనా ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకునేందుకు సత్యదేవ్ అండ్ టీమ్ రెడీ అవుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube