స్కైల్యాబ్ రివ్యూ: భూమి మీదే కాదు ప్రేక్షకుల మీద పడని స్కైల్యాబ్.!

విశ్వ ఖండే రావు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘స్కైల్యాబ్’. ఇందులో సత్యదేవ్, నిత్యామీనన్, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలో నటించారు.

 Satyadev Nithya Menon Skylab Moive Review And Rating Details,  Skylab, Tollywood-TeluguStop.com

బ్రైట్​ ఫ్యూచర్స్, నిత్యామీనన్ కంపెనీ పతాకాలపై పృథ్వీ పిన్నమరాజు ఈ సినిమాను నిర్మించాడు.ఇందులో తనికెళ్ళ భరణి, తులసి తదితరులు నటించారు.

ఈ సినిమాకు ప్రశాంత్ ఆర్ విహారి సంగీతాన్ని అందించాడు.ఇక ఈ సినిమా 1979లో సాగే పీరియాడిక్ నేపథ్యంలో తెరకెక్కింది.అప్పట్లో అమెరికా స్పేస్ స్కైల్యాబ్ భూమిపై పడుతుందని వార్తలు రావడంతో ఆ సమయంలో తెలంగాణలో బండలింగంపల్లి అనే గ్రామంలో ఓ ముగ్గురి జీవితాల్లో ఎదురైన పరిణామాలను ఈ సినిమాలో చూపించారు.

కథ:

ఇక ఈ సినిమాలో కథ ఏంటంటే 1979లో బండలింగంపల్లి అనే గ్రామం చుట్టూ జరిగిన కథలోనిది.ఆకాశం నుంచి 90 వేల కిలోల స్కై ల్యాబ్ ఈ గ్రామంలో పడుతుందని వార్తలలో ప్రకటిస్తారు.ఇక ఇందులో నిత్యామీనన్ గౌరీ అనే రైటర్ పాత్రలో నటిస్తుంది.

అదే సమయంలో ఉద్యోగం నుంచి తీసేయడం తో తను తిరిగి తన ఊరికి వెళ్ళిపోతుంది.ఇక ఇందులో సత్యదేవ్ డాక్టర్ ఆనంద్ పాత్రలో నటిస్తాడు.

ఇతడు కూడా తన ఉద్యోగం నుంచి సస్పెండ్ కావడంతో తిరిగి ఇతడు కూడా ఊరికి వెళ్లి పోతాడు.రాహుల్ రామకృష్ణ రామారావు అనే పాత్రలో నటిస్తాడు.

రామారావు అప్పులు చేసి తీర్చలేక ఇబ్బందులు పడుతుంటాడు.అలా ఈ ముగ్గురు కలిసి తమ ఊర్లో పడనున్న స్కై ల్యాబ్ ను ఏం చేస్తారో అన్నది.

ఇక గౌరీ ఈ స్కై ల్యాబ్ ద్వారా రైటర్ గా తానేమిటో నిరూపించుకుంటుందా లేదా అనేది.ఈ గ్రామంలో చివరికి ఏం జరుగుతుంది అనేది మిగిలిన కథలో చూడవచ్చు.

Telugu Nithya Menon, Periodic, Review, Satya Dev, Skylab, Skylab Review, Skylab

నటీనటుల నటన:

నిత్యా మీనన్ తన నటనతో బాగా ఆకట్టుకుంది.సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ తమ పాత్రల్లో లీనమయ్యారు.తదితర నటులు కూడా తమ పాత్రలతో అద్భుతంగా మెప్పించారు.

టెక్నికల్:

ఈ సినిమాను డైరెక్టర్ మరింత కొత్తదనంతో తెరకెక్కిస్తే బాగుండేది.చాలావరకు ఆయన చిత్రీకరించే విధానం లో కాస్త విఫలం అయినట్లు తెలుస్తోంది.సినిమాటోగ్రఫీ బాగుంది.బ్యాక్ గ్రౌండ్ కూడా అద్భుతంగా ఉంది.విహారి అందించిన మ్యూజిక్ ఆకట్టుకుంది.

విశ్లేషణ:

ఈ సినిమాలో నటీనటుల పాత్ర, నటన బాగా ఆకట్టుకుంది.కానీ దర్శకుడు ఈ సినిమాను అంతగా చూపించలేకపోయాడు.

కథ మాత్రం అద్భుతంగా ఉంది.సంగీతం బాగా ఆకట్టుకుంది.

Telugu Nithya Menon, Periodic, Review, Satya Dev, Skylab, Skylab Review, Skylab

ప్లస్ పాయింట్స్:

నటీనటుల నటన, అద్భుతమైన కథ, సెకండాఫ్ బాగా ఆకట్టుకున్నాయి.

మైనస్ పాయింట్స్:

ఫస్టాఫ్ కామెడీ ఆకట్టుకోలేదు.సినిమా సాగదీసినట్లు అనిపించింది.డైరెక్టర్ ఇంకా అద్భుతంగా తెరకెక్కిస్తే బాగుండేది.

Telugu Nithya Menon, Periodic, Review, Satya Dev, Skylab, Skylab Review, Skylab

బాటమ్ లైన్:

ఈ మధ్యకాలంలో రానటువంటి కొత్త కథగా ఈ సినిమా తెరకెక్కింది.ఇందులో గతంలో ఏం జరిగిందో అనేది చూడటానికి ఆసక్తిగా ఉంటుంది.కాబట్టి ఈ సినిమా థియేటర్ లో చూడవచ్చు.

రేటింగ్: 2.5/5

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube