సత్యదేవ్ జోడీగా నయనతార.. లక్ అంటే ఇదే బాసు..!

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతారతో టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ జోడీ కడతారని ఎవరు ఊహించి ఉండరు.కాని అది జరుగుతుంది.

 Satyadev Nayanathara Jodi Megastar Chiranjeevi Godfather Movie, Satyadev , Naya-TeluguStop.com

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమాలో నయనతార ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది.ఈ సినిమాలో సత్యదేవ్ కూడా చాలా ప్రాముఖ్యత ఉన్న పాత్రలో నటిస్తున్నాడు.

సినిమాలో సత్యదేవ్ కి జోడీగా నయనతార నాటిస్తుండటం విశేషం.టాలీవుడ్ యంగ్ హీరోగా తన మార్క్ సినిమాలతో అలరిస్తున్న సత్యదేవ్ కి చిరు సినిమా ఛాన్స్ లక్కీ అని చెప్పొచ్చు.

అదికాకుండా నయనతారతో కలిసి నటించే ఛాన్స్ రావడం నిజంగానే లక్కీ అని అనుకోవచ్చు.మోహన్ రాజా డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో చిరు డిఫరెంట్ లుక్ తో కనిపిస్తారని తెలుస్తుంది.

సత్యదేవ్ పాత్ర కోసం చాలామందిని అనుకోగా ఫైనల్ గా అతన్ని ఫిక్స్ చేశారు.ఇన్నాళ్లు మీడియం బడ్జెట్ సినిమాలతో అలరించిన సత్యదేవ్ కి మెగా మూవీ ఛాన్స్ కెరియర్ ని టర్న్ చేస్తుందని అంటున్నారు.

మళయాళ మూవీ లూసిఫర్ కు రీమేక్ గా వస్తున్న గాడ్ ఫాదర్ సినిమా తెలుగు నేటివిటీకి తగినట్టుగా మార్చారని తెలుస్తుంది.కథలో మెగాస్టార్ ఇమేజ్ కు తగినట్టుగా కొన్ని మార్పులు చేశారని తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube