Gurthunda Seethakalam Movie : గుర్తుందా శీతాకాలం.. అసలు ఉన్నట్లా? లేనట్లా?

Satyadev Gurthunda Seethakalam Movie Release Update , Gurthunda Seethakalam Movie ,satyadev ,Tamanna, Movie News

సత్యదేవ్ హీరోగా తమన్నా హీరోయిన్ గా రూపొందిన గుర్తుందా శీతాకాలం సినిమా ఈవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.చాలా కాలంగా వాయిదాలు పడుతూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు విడుదల కాబోతున్న నేపథ్యం లో హడావుడి విపరీతంగా చేయాల్సి ఉంటుంది.

 Satyadev Gurthunda Seethakalam Movie Release Update , Gurthunda Seethakalam Movi-TeluguStop.com

కానీ ఏ మాత్రం హడావుడి లేకుండా ఈ సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం ఆశ్చర్యంగా ఉంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు కామెంట్స్ చేస్తున్నారు.సోషల్ మీడియా లో ఈ సినిమా గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరగడం లేదు.

తమన్నా సినిమా అయినప్పటికీ అసలు ఈ సినిమా విడుదల అవుతుందా లేదా అనుమానాలు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ప్రస్తుతం సినిమా కు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు ఏమి జరగక పోవడంతో క్రియేట్ అవ్వలేదు.

సినిమా కు మరో మూడు రోజుల సమయం మిగిలి ఉంది, కనుక ఈ సమయంలో ఏమైనా హడావిడి చేసి సినిమా యొక్క బజ్ క్రియేట్ చేస్తారా అనేది చూడాలి.

Telugu Satya Dev, Tamanna, Telugu-Movie

ప్రస్తుతం సినిమా కు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఏర్పాటు జరుగుతున్నాయి.ప్రముఖ యంగ్ హీరో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కోసం వచ్చేందుకు ఓకే చెప్పాడని చిత్ర యూనిట్ సభ్యులు చెప్తున్నారు.ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత అయినా సినిమా యొక్క అంచనాలు పెరిగి ఆసక్తి పెరుగుతుందేమో చూడాలి.

తమన్నా ఈ మధ్య కాలంలో తెలుగులో సక్సెస్ దక్కించుకున్న దాఖలాలు లేవు.అందుకే ఈ సినిమా సక్సెస్ అయితే ఆమె కెరియర్ మరి కొన్నాళ్ల పాటు టాలీవుడ్ లో కొనసాగే అవకాశం ఉందని ఆమె అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరో వైపు సత్యదేవ్‌ కూడా ఈ సినిమా తో సక్సెస్ దక్కించుకుంటే మరొక సక్సెస్ ఆయన ఖాతాలో పడ్డట్టు అవుతుంది.దాంతో మరిన్ని సినిమాలు ఆయన నుండి వస్తాయి అన్నట్లు మీడియా వర్గాల వారు చర్చించుకుంటున్నారు.

ఏం జరుగుతుందో చూడాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube