రజినీకాంత్ సినిమాలో అవకాశం పట్టేసిన ఉమామహేశ్వరరావు

టాలీవుడ్ లో జెట్ స్పీడ్ తో నటుడుగా ప్రూవ్ చేసుకుంటూ దూసుకుపోతున్న మరో యువ హీరో సత్యదేవ్.క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరియర్ స్టార్ట్ చేసిన సత్యదేవ్ జ్యోతిలక్ష్మి సినిమాతో హీరోగా టర్న్ తీసుకున్నాడు.

 Satyadev Got A  Chance In Rajinikanth Movie, Tollywood, Kollywood, Rajinikanth,-TeluguStop.com

అయినా కూడా ఓ వైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇతర హీరోల సినిమాలలో చేస్తూనే మరోవైపు హీరోగా కూడా తనని తాను ప్రూవ్ చేసుకుంటూ ముందుకి వెళ్తున్నాడు.తాజాగా వెంకటేష్ మహా దర్శకత్వంలో మలయాళీ రీమేక్ గా ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమా ప్రేక్షకుల మన్ననలు అందుకోవడంతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా సొంతం చేసుకుంది.

ఇందులో సత్యదేవ్ చేసిన ఉమామహేశ్వరరావు పాత్ర ప్రతి ఒక్కరికి భాగా కనెక్ట్ అయిపొయింది.ఈ సినిమా హిట్ తో సత్యదేవ్ ఏకంగా తన ట్విట్టర్ ప్రొఫైల్ పేరు ఉమామహేశ్వరరావు క్రింద మార్చేశాడు.

ఇక ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసిన మెప్పించిన సత్యదేవ్ టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదగడం పక్కా అని అందరూ చెప్పుకుంటున్నారు.ప్రస్తుతం ఈ యువ హీరో తమన్నాతో జతగా లవ్ మాక్ టైల్ అనే కన్నడ హిట్ మూవీ రీమేక్ లో నటిస్తున్నాడు.

ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయ్యింది.ఇదిలా ఉంటే ఇప్పుడు సత్యదేవ్ మరో క్రేజీ ఆఫర్ సొంతం చేసుకున్నట్లు టాక్ వినిపిస్తుంది.శివ దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా తమిళంలో అన్నాత్తై అనే తెరకెక్కుతుంది.ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం తెలుగు నటుడుని తీసుకోవాలని దర్శకుడు ప్లాన్ చేసి సత్యదేవ్ ని సంప్రదించినట్లు సమాచారం.

రజినీకాంత్ సినిమా కావడంతో సత్యదేవ్ కూడా వెంటనే ఒకే చెప్పినట్లు తెలుస్తుంది.త్వరలో ఈ సినిమా సత్యదేవ్ కి సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉందని బోగట్టా.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube