సత్యనాదెళ్ల ఆదేశం.. కదిలిన మైక్రోసాఫ్ట్ యంత్రాంగం, బిల్‌గేట్స్ లైంగిక సంబంధాలపై దర్యాప్తు

Satya Nadellas Memo As Microsoft Starts Review Of Bill Gates Probe

మైక్రోసాఫ్ట్ మాజీ ఛైర్మన్ బిల్‌గేట్స్ లైంగిక సంబంధాల వ్యవహారం కార్పోరేట్ ప్రపంచాన్ని కలవరపాటుకు గురిచేసిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ వాటాదారుల నుంచి వచ్చిన ఒత్తిడికి స్పందించిన బోర్డు… 2019 నాటి బిల్‌గేట్స్ లైంగిక వేధింపులు, లింగ వివక్ష విధానాలను సమీక్షించేందుకు ఒక న్యాయ సంస్థను నియమించింది.

 Satya Nadellas Memo As Microsoft Starts Review Of Bill Gates Probe-TeluguStop.com

ఆరెంట్ ఫాక్స్ సంస్థకు ఈ తరహా విషయాలలో అనుభవం వుందని మైక్రోసాఫ్ట్ తెలిపింది.విచారణకు సంబంధించిన విషయాలను బోర్డు, మైక్రోసాఫ్ట్ మేనేజ్‌మెంట్‌కు ఆరెంట్ ఫాక్స్ నివేదిస్తుంది.

నాన్ బైండింగ్ షేర్ హోల్డర్ రిజల్యూషన్ ప్రకారం.మైక్రోసాఫ్ట్ తన లైంగిక వేధింపుల విధానాల ప్రభావాన్ని సమీక్షించాలని కోరింది.

 Satya Nadellas Memo As Microsoft Starts Review Of Bill Gates Probe-సత్యనాదెళ్ల ఆదేశం.. కదిలిన మైక్రోసాఫ్ట్ యంత్రాంగం, బిల్‌గేట్స్ లైంగిక సంబంధాలపై దర్యాప్తు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అర్జున క్యాపిటల్ స్పాన్సర్ చేసిన తీర్మానం నవంబర్‌లో ఆమోదించబడింది.కొన్నాళ్ల క్రితం మహిళా ఉద్యోగుల పట్ల గేట్స్ అనుచితంగా ప్రవర్తించినట్లు వార్తలు వచ్చాయి.

2019లో మేనేజ్‌మెంట్‌కు రాసిన సుదీర్ఘ ఈ మెయిల్‌లో ఉద్యోగులు లేవనెత్తిన ఆందోళనలు, సమస్యలను పరిష్కరించడానికి మైక్రోసాఫ్ట్ తీసుకున్న చర్యలు, 2019 నుంచి దర్యాప్తు, వాటి ఫలితాలు, తీర్మానంలో భాగమైన అన్ని అంశాలకు సంబంధించిన డేటాను ఈ న్యాయసంస్థ సేకరిస్తుంది.మైక్రోసాఫ్ట్ ఛైర్మన్ , చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సత్య నాదెళ్ల మాట్లాడుతూ.

ఈ సమీక్షను మెరుగవ్వడానికి ఒక అవకాశంగా పేర్కొన్నారు.

కాగా.మహిళా ఉద్యోగితో లైంగిక సంబంధాలపై బిల్‌గేట్స్‌ను 2008లోనే కంపెనీ హెచ్చరించినట్లు తాజాగా గతేడాది అక్టోబర్‌లో అమెరికన్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.2007 ఆ మధ్యకాలంలో బిల్‌గేట్స్‌ .మైక్రోసాఫ్ట్‌ ప్రెసిడెంట్‌గా ఉన్నారు.ఆ సమయంలో ఓ మహిళా ఉద్యోగికి ఈ-మెయిళ్లు పంపడం.

తనను వ్యక్తిగతంగా కలవాలని కోరడం వంటి విషయాలు కంపెనీ బోర్డు దాకా వెళ్లాయి.ఇది మీ స్థాయికి తగిన ప్రవర్తన కాదని, ఇలాంటివి మానుకోవాలని మైక్రోసాఫ్ట్‌ ఎగ్జిక్యూటివ్‌ బోర్డు సభ్యుల బృందం గేట్స్‌ను హెచ్చరించింది.

ఈ-మెయిళ్లు పంపిన విషయాన్ని గేట్స్‌ సైతం అంగీకరించారని, భవిష్యత్తులో ఇలాంటి పనులు చేయనని ఆయన బోర్డుకు తెలిపినట్లు ప్రముఖ దినపత్రిక వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ కథనం పేర్కొంది.గేట్స్‌పై వివరణ వల్లే బోర్డు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపింది.

ఈ కథనాన్ని మైక్రోసాఫ్ట్‌ ప్రతినిధి కూడా ధ్రువీకరించారని సమాచారం.కాగా.

ఈ-మెయిళ్ల విషయం వెలుగులోకి వచ్చిన కొద్ది రోజుల తర్వాత బిల్‌‌గేట్స్‌ మైక్రోసాఫ్ట్‌ ప్రెసిడెంట్ పదవి నుంచి దిగిపోయారు.

మరోవపు బిల్‌గేట్స్ ఆయన సతీమణి మెలిండా గేట్స్ 27 ఏళ్ల వైవాహిక బంధానికి గతేడాది ఆగస్టు మొదటి వారంలోనే అధికారికంగా తెరప‌డింది.మెలిండా ద‌ర‌ఖాస్తు చేసుకున్న విడాకుల‌కు కోర్టు ఆమోదం తెలిపింది.దీంతో బిల్‌గేట్స్ ఇప్పుడు ఒంటరివాడు అయిపోయారు.

తాము విడిపోతున్న‌ట్లు గేట్స్ దంప‌తులు మే నెల‌లోనే ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.అనంతరం వాషింగ్ట‌న్‌లోని కింగ్ కౌంటీ కోర్టులో మెలిండా గేట్స్ విడాకుల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు.

దీనిని పరిశీలించి విచారణ జరిపిన న్యాయమూర్తి విడాకులకు అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు.

#Satya Nadella #SatyaNadellas #Microsoft #Fox Microsoft #Executive

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube