జార్జ్ ఫ్లాయిడ్ హత్య: నల్లజాతీయుల పోరాటానికి భారతీయ సీఈవోల సంఘీభావం  

Satya Nadella And Sundar Pichai Floyd Death - Telugu America, Blackman, George Floyd, Protesters, Satya Nadella And Sundar Pichai Joins Tech Bosses In Slamming Floyd Death, Trump

పోలీసుల చేతిలో నల్లజాతి వ్యక్తి జార్జ్ ఫ్లాయిడ్ మరణానికి నిరసనగా అమెరికాలో నిరసనలు రోజురోజుకు ఉద్ధృతమవుతున్నాయి.ఆందోళనకారులు గత వారం రోజులుగా నిరసన వెళ్లగక్కుతున్నారు.

 Satya Nadella And Sundar Pichai Floyd Death

ఏకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం నిరసనల తాకిడిని తట్టుకోలేక వైట్‌హౌస్‌ను వీడి బంకర్‌లో తలదాచుకున్నారంటే పరిస్ధితి అర్ధం చేసుకోవచ్చు.భార్య, కుమారుడితో కలిసి ట్రంప్ దాదాపు గంట పాటు అక్కడే ఉన్నారు.

ఈ నేపథ్యంలో న్యాయం కోసం నల్లజాతీయులు చేస్తున్న పోరాటానికి భారత సంతతికి చెందిన కార్పోరేట్ సంస్థల అధిపతులు సంఘీభావం ప్రకటించారు.మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తమ స్పందనను తెలియజేశారు.

జార్జ్ ఫ్లాయిడ్ హత్య: నల్లజాతీయుల పోరాటానికి భారతీయ సీఈవోల సంఘీభావం-Telugu NRI-Telugu Tollywood Photo Image

ఈ ఘటన పట్ల బాధ, కోపం, విచారం, భయంతో ఉన్న వారెవ్వరూ ఏకాకులు కాదు.జాతి సమానత్వానికి మద్ధతుగా నిలబడతామని సుందర్ పిచాయ్ ట్వీట్ చేశారు.

ఆ కాసేపటికే మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల రంగంలోకి దిగారు.జాతి వివక్షను, జాత్యహంకారాన్ని ఖండించిన ఆయన… నల్లజాతి సమాజానికి తమ సంఘీభావం తెలిపారు.సంఘంలో ద్వేషానికి, జాత్యహంకారానికి చోటు లేదని తేల్చిచెప్పారు.నల్లజాతీయులపై సానుభూతి, పరస్పర అవగాహన మొదలైనప్పటికీ, చేయాల్సింది.సాధించాల్సింది ఎంతో వుందని సత్య నాదెళ్ల అభిప్రాయపడ్డారు.కాగా అమెరికాను ఇంతలా వణికిస్తున్న జార్జ్ ఫ్లాయిడ్‌ది హత్యేనని పోస్ట్‌మార్టం నివేదిక తేల్చింది.

మెడపై మోకాలు మోపి, నొక్కి పెట్టి ఊపిరాడకుండా చేసి హతమార్చారని వైద్యులు తమ నివేదికలో స్పష్టం చేశారు.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు