వైసీపీకి షాక్.. పార్టీకి రాజీనామా చేసిన డిప్యూటీ సీఎం మామ.. ?

ఏపీలో తిరుగు లేకుండా దూసుకుపోతున్న వైఎస్సార్‌సీపీకి విజయనగరం జిల్లాలో షాక్ తగిలిందట.ఎన్నో సంక్షేమ పధకాలతో ప్రజలకు చేరువలో ఉన్న జగన్ ప్రభుత్వానికి ఇది ఊహించని పరిణామం.

 Satrucharla Chandrasekhar Raju Resigned To Ysrcp-TeluguStop.com

ఇకపోతే వైఎస్సార్‌సీపీకి డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి మామ శత్రుచర్ల చంద్రశేఖర రాజు రాజీనామా చేశారట.కాగా గతంలో కూడా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై శత్రుచర్ల విమర్శలు చేశారు.

అయితే ఇప్పుడు ఏకంగా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో పార్టీవర్గాల్లో చర్చ మొదలైందట.

 Satrucharla Chandrasekhar Raju Resigned To Ysrcp-వైసీపీకి షాక్.. పార్టీకి రాజీనామా చేసిన డిప్యూటీ సీఎం మామ.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక శత్రుచర్ల చంద్రశేఖర రాజు తన రాజీనామకు వివరణ ఇచ్చుకుంటూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులకు ఓటు వేయకపోతే ప్రభుత్వ పథకాలు ఆపేస్తామని బెదిరించడం దారుణం.

ఎన్నికలు అయితే భయానక వాతావరణంలో జరిగాయని, ఇది నిరంకుశపాలనకు ఉదహరణ అని పేర్కొన్నారు.

అందుకే వైసీపీ నియంతృత్వ పోకడలకు నిరసనగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

అయితే కార్యకర్తలతో చర్చించి అనంతరం ఏ పార్టీలో చేరాలి అనే నిర్ణయం తీసుకుంటానని శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు స్పష్టం చేశారు.

#Resigned #Pamula Pushpa #Ysrcp

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు