వెబ్ సిరీస్ కి రెడీ అవుతున్న ఫ్యామిలీ దర్శకుడు

డిజిటల్ ఎంటర్టైన్మెంట్ మీద ప్రస్తుతం అందరూ ఆసక్తి చూపిస్తున్నారు.సినిమాకి ప్రత్యామ్నాయంగా తయారైన ఈ డిజిటల్ పరిశ్రమలోకి నటులు కూడా లాంగ్ టర్మ్ కెరియర్ వెతుక్కుంటూ వస్తున్నారు.

 Satish Vegesna Producer Web Series, Tollywood, Telugu Cinema, Digital Entertainm-TeluguStop.com

డిజిటల్ ఎంటర్టైన్మెంట్ కి డిమాండ్ పెరగడంతో ఓటీటీ ఛానల్స్ కూడా దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాయి.ఎంటర్టైన్మెంట్ రంగానికి ఇండియా అతి పెద్ద ఇండస్ట్రీ అని అర్ధం చేసుకున్న అమెజాన్ ప్రైమ్, డిస్నీ హాట్ స్టార్, నెట్ ఫ్లిక్స్ లాంటి సంస్థలు ఇండియన్ భాషలలో ఎక్కువగా వెబ్ సిరీస్ లు తెరకెక్కించేందుకు సిద్ధమయ్యాయి.

అలాగే లాంగ్వేజ్ బారియర్స్ చెరిపేసి ఒక వెబ్ సిరీస్ ని తెలుగు, తమిళ్, హిందీ భాషలలో కూడా టెలికాస్ట్ చేస్తున్నాయి.ఈ మూడు ఇండస్ట్రీలలో మార్కెట్ ఎక్కువగా ఉండటంతో వీటిపైనే ప్రత్యేక దృష్టి పెట్టాయి.

ఈ వెబ్ సిరీస్ లని వీక్షించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది.ఇప్పటికే హీరోయిన్స్ చాలా మంది ఓటీటీ బాట పట్టారు.

దర్శకులు కూడా ఓటీటీ ప్లాట్ ఫామ్ లోకి అడుగు పెడుతున్నారు.

ఇప్పుడు ఫ్యామిలీ చిత్రాల దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్న రచయిత వేగేశ్న సతీష్‌ కూడా వెబ్ సిరీస్ లోకి అడుగు పెడుతున్నాడు.

శతమానం భవతి సినిమాతో దర్శకుడుగా బ్లాక్ బస్టర్ కొట్టిన ఈ దర్శకుడు తరువాత శ్రీనివాస కళ్యాణం, ఎంత మంచి వాడవురా వంటి సినిమాలు ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా తెరకెక్కించినా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు.అయితే ఇప్పుడు వేగేశ్న ఓ వెబ్‌ సిరీస్‌ను నిర్మించనున్నట్లు తెలుస్తోంది.

ఈ వెబ్‌ సిరీస్‌లో విభిన్న పంథాలో కథని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.ఈ వెబ్‌ సిరీస్‌ను ఇన్వేస్టిగేటివ్‌ క్రైమ్‌ డ్రామా కథతో ప్రేక్షకులను ఉత్కంఠ భరితంగా సాగే థ్రిల్లర్‌ నేపథ్యంలో ఉండనుందని సమాచారం.

ఈ వెబ్‌ సిరీస్‌లో మొత్తం తొమ్మిది ఎపిసోడ్లు ఉంటాయని తెలుస్తోంది.అయితే ఈ వెబ్ సిరీస్ కి కేవలం నిర్మాతగానే సతీష్ వేగేశ్న ఉంటారా దర్శకత్వం కూడా చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube