రూట్ మార్చిన ఫ్యామిలీ దర్శకుడు... కొడుకు కోసం యూత్ ఫుల్ స్టొరీ

రచయితగా కెరియర్ ప్రారంభించి మంచి గుర్తింపు తెచ్చుకొని తరువాత దొంగల బండి సినిమాతో దర్శకుడు అవతారం ఎత్తిన వ్యక్తి సతీష్ వేగేశ్న.ఆ సినిమా డిజాస్టర్ కావడంతో మరల చాలా గ్యాప్ తీసుకొని శతమానం భవతి అనే సినిమాతో దర్శకుడుగా మొదటి సక్సెస్ అందుకున్నాడు.

 Director Satish Vegesna Wrote Youthful Entertainment Story, Tollywood, Telugu Ci-TeluguStop.com

ఆ సినిమాతో ఫ్యామిలీ కథలని భాగా డీల్ చేస్తాడని గుర్తింపు తెచ్చుకున్న సతీష్ వేగేశ్న తన నెక్స్ట్ సినిమాని నితిన్ తో శ్రీనివాస కళ్యాణం అంటూ తెరకెక్కించారు.ఇందులో చెప్పాలనుకున్న కంటెంట్ భాగానే ఉన్న మరీ ఎక్కువగా నీతులు చెప్పడం ఈ జెనరేషన్ ని కనెక్ట్ కాలేదు.

తరువాత కూడా ఎంత మంచి వాడవురా అంటూ ఫ్యామిలీ డ్రామాతోనే మరో సారి, కుటుంబం, బంధాలు, విలువలు అంటూ అంతరించిపోయిన ఎమోషన్స్ ని ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు.అతని ప్రయత్నం భాగానే ఉన్న ప్రేక్షకులు మాత్రం వాటిని రిసీవ్ చేసుకోలేకపోయారు.

అందుకే ఈ సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది.

దీంతో ఫ్యామిలీ ఎమోషన్స్ మరీ శృతి మించితే జనాలు చూడలేకపోతున్నారని అర్ధం చేసుకున్న సతీష్ వేగేశ్న ఈ సారి కంప్లీట్ గా జోనర్ మార్చేస్తున్నారు.

ఈసారి యూత్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ ను తెరకెక్కించాలి అని ప్లాన్ చేస్తున్నాడు.తన కొడుకు సమీర్ ను హీరోగా పరిచయం చేస్తూ సతీష్ వేగేశ్న ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు.

దీని కోసం పక్కా యూత్ ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ కథని సిద్ధం చేసినట్లు తెలుస్తుంది.అలా అని తన మార్క్ ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయని, అయితే మరీ అవి శృతి మించకుండా ఈ జెనరేషన్ ని సరిపోయే రేంజ్ లోనే ఉండబోతున్నాయని తెలుస్తుంది.

ఈ సినిమాలో తన కొడుకు సమీర్ తో పాటు మరో యువ హీరో కూడా ఉంటాడని ఇన్సైడ్ టాక్.తానే నిర్మాతగా ఈ సినిమాని తెరకెక్కించనున్నట్లు చెప్పుకుంటున్నారు.

త్వరలో దీనికి సంబందించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube