పాపం….  వైద్యం కూడా చేయించుకొని స్థితిలో ఉన్న ఇంద్రుడు..  

Satish Kaul Mahabharatham - Telugu Dd National, Financial Struggles, Mahabharatham, Satish Kaul, Serial Actor

ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన సంగతి అందరికీ తెలిసిందే.అయితే ఈ లాక్ డౌన్ విధించడంతో సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి కార్యకలాపాలన్నీ తాత్కాలికంగా కొంత కాలం పాటు నిలిపివేశారు.

 Satish Kaul Mahabharatham

దీంతో కొందరు చిన్నాచితకా ఆర్టిస్టులు పూట గడవక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అప్పులు చేసి సినీ పరిశ్రమలో పెట్టుబడి పెట్టినటువంటి సినీ నిర్మాతలు పనులు జరగక వడ్డీలు కట్టలేక నానా అవస్థలు పడుతున్నారు.

అయితే అప్పట్లో ప్రముఖ టెలివిజన్ ఛానల్ అయినటువంటి  డీడీ నేషనల్ ఛానల్ లో ప్రసారమయ్యే మహాభారతం సీరియల్ అందరికీ ఇప్పటికీ బాగానే గుర్తు ఉంటుంది.అయితే ఈ మహాభారతం సీరియల్ లో ఇంద్రుడి పాత్రలో నటించిన టువంటి సతీష్ కౌల్ ప్రస్తుతం అనారోగ్యంతో మంచాన పడి ఆదుకునేవారు లేక తీవ్ర అవస్థలు పడుతున్నాడు.

పాపం….  వైద్యం కూడా చేయించుకొని స్థితిలో ఉన్న ఇంద్రుడు..-Latest News-Telugu Tollywood Photo Image

అంతేగాక కనీసం మందులు, కుటుంబ నిత్యావసర సరుకులు కొనుక్కోలేని పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు.దీంతో ఒకప్పుడు పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలలో నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించినటువంటి సతీష్ కౌల్ ప్రస్తుతం ఇలాంటి పరిస్థితుల్లో ఉండడం బాధాకరమని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరికొందరైతే సినీ పరిశ్రమకు ఆర్టిస్టులు ఎంతో అవసరమని అలాంటిది వారు కష్టాల్లో ఉంటే ఆదుకోవాలని, కాబట్టి సహాయం చేయాలని కోరుతున్నారు.

అయితే ప్రస్తుతం కరోనా ప్రభావం తక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో కేంద్రం లాక్ డౌన్ సడలింపులు చేపట్టింది.

ఇందులో భాగంగా ముంబై సినీ పరిశ్రమలో షరతులు విధిస్తు షూటింగ్ లను నిర్వహించుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది.దీంతో కొంతమేర ఆర్థిక పరంగా ఇబ్బందులు పడుతున్నటువంటి ఆర్టిస్టులకు ఊరట కలగనుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు