అవినాష్ జంట మీద సెటైర్లు.. శ్రీముఖి కామెంట్లు వైరల్

బుల్లితెరపై ప్రసారమైన జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న కమెడియన్ ముక్కు అవినాష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ కార్యక్రమం ద్వారా కమెడియన్ గా ఎంతో పాపులారిటీ దక్కించుకున్న ఈయన బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి అవినాష్ కాస్త అతినాష్ గా మారిపోయాడు.

 Satires On Avinash Couple And Srimukhi Comments Goes Viral Avinash Couple, Srimu-TeluguStop.com

బిగ్ బాస్ హౌస్ లో కాస్త ఓవరాక్షన్ చేస్తూ ఓ క్రమంలో ప్రేక్షకులకు విసుగు తెప్పించారని చెప్పవచ్చు.ఇలా బిగ్ బాస్ ద్వారా కూడా మరింత పాపులారిటీ సంపాదించిన అవినాష్ ఆ తర్వాత స్టార్ మాలో ప్రసారం అవుతున్న కామెడీ స్టార్ కార్యక్రమంలో తనదైన శైలిలో తన కామెడీ ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

ఇకపోతే అవినాష్ గత ఏడాది అనూజ అనే అమ్మాయిని వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.ఇక అవినాష్ వివాహం జరిగిన తర్వాత తన భార్యతో కలిసి స్టార్ మాలో ప్రసారం అవుతున్న ఇస్మార్ట్ జోడి సీజన్ 2 ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.

ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంలో భాగంగా వీరిద్దరూ ఎన్నో టాస్క్ లలో పాల్గొంటూ ఎంతో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.ఈ క్రమంలోనే గత వారం ఈ జోడిలతో డాన్స్ పర్ఫార్మెన్స్ చేయించారు.

ఈ క్రమంలోనే అవినాష్ తన భార్య అనూజతో కలిసి డాన్స్ పెర్ఫార్మెన్స్ చేశారు.

ఈ క్రమంలోనే ఈ విషయంపై ముక్కు అవినాష్ సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ “ఏం చేశామో ఏమో మాకే అర్థం కావడం లేదు….కానీ ఏదో చేశాం” అంటూ చెప్పుకొచ్చారు.ఇలా అవినాష్ వారి డాన్స్ పర్ఫార్మెన్స్ గురించి కామెంట్ చేయడంతో వెంటనే తన స్నేహితురాలు బుల్లితెర యాంకర్ శ్రీముఖి స్పందిస్తూ తనదైనశైలిలో కామెంట్ చేశారు.

ఈ సందర్భంగా శ్రీముఖి స్పందిస్తూ… మీరిద్దరూ డాన్స్ పర్ఫార్మెన్స్ ఎంతో సింక్ అయింది RRR సినిమాలో ఎన్టీఆర్ రామ్ చరణ్ మధ్య కూడా ఈ కోఆర్డినేషన్ చూడలేదు… ఫర్ఫెక్ట్ కోఆర్డినేషన్ మీది అంటూ కామెంట్ చేశారు.ప్రస్తుతం శ్రీముఖి చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇకపోతే అవినాష్ వివాహం తర్వాత సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు.ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా తన భార్యతో కలిసి రీల్స్ చేయడం, యూట్యూబ్ వీడియోలను షేర్ చేస్తూ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా పోస్ట్ చేయడం, అదేవిధంగా కామెడీ స్టార్స్ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తూ అవినాష్ కెరియర్ లో ఎంతో బిజీగా ఉన్నారు.ఇక అవినాష్ దూకుడు చూస్తుంటే ముందు ముందు తన భార్యను కూడా ఇండస్ట్రీలోకి తీసుకు వస్తారు అనడంలో ఏమాత్రం సందేహం వ్యక్తం చేయాల్సిన పనిలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube