గోపీచంద్ తండ్రిగా మరోసారి కట్టప్ప  

Sathyaraj Play Gopichand Father Role in Maruti Movie, Tollywood, Telugu Cinema, South Cinema, Geeta Arts2, UV Creations, - Telugu Geeta Arts2, Gopichand, Maruti Movie, Sathyaraj, South Cinema, Telugu Cinema, Tollywood, Uv Creations

యాక్షన్ హీరోగా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హీరో గోపీచంద్.కెరియర్ లో ఎక్కువగా కమర్షియల్ యాక్షన్ సినిమాలని చేసిన గోపిచంద్ ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో సిటీమార్ అనే సినిమా చేస్తున్నాడు.

TeluguStop.com - Sathyaraj Play Gopichand Father Role In Maruti Movie

ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది.స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో కబడ్డీ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ ఫైనల్ షెడ్యుల్ ప్రస్తుతం జరుగుతుంది.దీని తర్వాత గోపీచంద్ మారుతి దర్శకత్వంలో సినిమా చేయడానికి ఒకే చెప్పాడు.

TeluguStop.com - గోపీచంద్ తండ్రిగా మరోసారి కట్టప్ప-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

కామెడీ ఎంటర్టైన్మెంట్ కి కేరాఫ్ అడ్రెస్ గా మారుతి ప్రస్తుతం టాలీవుడ్ లో కొనసాగుతున్నాడు.చివరిగా ప్రతి రోజు పండగే సినిమాతో మారుతి హిట్ కొట్టాడు.

అయితే రవితేజతో నెక్స్ట్ సినిమా చేయాలని వెయిట్ చేసిన ప్రస్తుతం అతని డేట్స్ అందుబాటులో లేవు.దీంతో గోపిచంద్ కి కథ చెప్పి ఫైనల్ చేసుకున్నాడు.

యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది.ఇక పక్కా కమర్షియల్ టైటిల్ తో ఈ సినిమాని మారుతి తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా తండ్రి కొడుకుల మధ్య నడిచే కథాంశంతో ఉండబోతుందని తెలుస్తుంది.తండ్రి జడ్జ్ గా, కొడుకు గోపీచంద్ లాయర్ గా కనిపిస్తాడని ఇద్దరి మధ్య నడిచే ట్రాక్ కామెడీ, ఎమోషనల్ ఎలిమెంట్స్ తో ఉంటుందని టాక్ వినిపిస్తుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో గోపీచంద్ తండ్రి పాత్రలో సత్యరాజ్ ని ఫైనల్ చేసినట్లు టాక్ నడుస్తుంది. గోపీచంద్, సత్యరాజ్ కాంబినేషన్ లో గతంలో శంఖం అనే సినిమా వచ్చింది.

ఈ సినిమా ఎవరేజ్ టాక్ సొంతం చేసుకుంది.మరోసారి ఈ ఇద్దరు తెరపై తండ్రి కొడుకులుగా నవ్వులు పోయించడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది.

#Geeta Arts2 #Sathyaraj #Gopichand #UV Creations

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు