సూర్య కిరణ్ : నేను కావాలని కళ్యాణి కి విడాకులు ఇవ్వలేదు.. కానీ….   

Sathyam movie fame Director Surya kiran react about divorce with His wife Kalyani, Surya kiran, Director, Kalyani, Tollywood actress, Telugu movie heroine, Divorce news, Bigg boss Season Four Contestant - Telugu Bigg Boss Season Four Contestant, Director, Divorce News, Kalyani, Sathyam Movie Fame Director Surya Kiran React About Divorce With His Wife Kalyani, Surya Kiran, Telugu Movie Heroine, Tollywood Actress

తెలుగులో అక్కినేని హీరో సుమంత్ హీరోగా నటించినటువంటి “సత్యం” చిత్రం అప్పట్లో ఎంత మంచి బ్లాక్ బాస్టర్ హిట్ అయిందో తెలుగు సినీ ప్రేక్షకులకి ఇప్పటికీ బాగానే గుర్తుంటుంది. అయితే ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన దర్శకుడు సూర్య కిరణ్ కి మాత్రం తన సినీ కెరీర్ లో ఈ చిత్రం తప్ప చెప్పుకోవడానికి మరో బిగ్గెస్ట్ హిట్ చిత్రం లేదు.

TeluguStop.com - Sathyam Movie Fame Director Surya Kiran React About Divorce With His Wife Kalyani

  అయితే తాజాగా సూర్య కిరణ్ మంచి పాపులారిటీ సంపాదించుకున్న రియాల్టీ గేమ్ షో బిగ్ బాస్ నాలుగో సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొన్నాడు.కానీ దురదృష్టవశాత్తు మొదటి వారంలోనే ఎలిమినేట్ అయ్యాడు.

అయితే తాజాగా సూర్య కిరణ్ ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మరియు తన భార్య కళ్యాణి తో విడిపోవడానికి గల కారణాలను అభిమానులతో పంచుకున్నాడు.ఇందులో భాగంగా తన మాజీ భార్య కళ్యాణిని తాను ఎంతగానో ప్రేమిస్తున్నానని కానీ కళ్యాణికి తనతో జీవించడం ఇష్టం లేదని దాంతో ఆమె ఇష్టాన్ని గౌరవించి ఆమెకు విడాకులు ఇచ్చానని చెప్పుకొచ్చాడు.

TeluguStop.com - సూర్య కిరణ్ : నేను కావాలని కళ్యాణి కి విడాకులు ఇవ్వలేదు.. కానీ…. -Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అంతేగాక ఇప్పటికీ తన భార్యని తాను ఎంతగానో గౌరవిస్తున్నానని  తెలిపాడు.

దీంతో ఈ విషయంపై కొందరు నెటిజన్లు స్పందిస్తూ సృష్టిలో భార్య భర్తల బంధం ఎంతో గొప్పదని కాబట్టి ఆ బంధం ఉన్నప్పుడే కలహాలు, సమస్యల గురించి ఇద్దరూ ఆలోచిస్తే భవిష్యత్తులో బాధ పడే పని ఉండేది కాదని కామెంట్లు చేస్తున్నారు.

 అంతేగాక ఎవరిని కూడా మన జీవితంలో బలవంతంగా ఉండమని చెప్పడం సరికాదని కానీ మనల్ని బాగా అర్థం చేసుకునే మనుషులు మన జీవితం లోకి వస్తే అప్పుడు మన జీవితం మరింత హ్యాపీగా ఉంటుందని సూర్య కిరణ్ కి ధైర్యం చెబుతున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా మాజీ హీరోయిన్ కళ్యాణి తన భర్త సూర్య కిరణ్ తో విడిపోయినప్పటినుంచి చెన్నైలో నివాసం ఉంటున్నట్లు సమాచారం.

అంతేగాక ఈ మధ్యనే కళ్యాణి దర్శకురాలిగా మారి ఓ చిన్న తరహా బడ్జెట్ చిత్రానికి దర్శకత్వం వహిస్తూనే ఈ చిత్రానికి సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నట్లు ఆ మధ్య కాలంలో పలు వార్తలు బలంగా వినిపించాయి.కానీ కళ్యాణి తాను దర్శకత్వం వహిస్తున్నట్లు వస్తున్నటువంటి వార్తలపై మాత్రం నటి కళ్యాణి ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు.

#Director #Kalyani #BiggBoss #TeluguMovie #Surya Kiran

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sathyam Movie Fame Director Surya Kiran React About Divorce With His Wife Kalyani Related Telugu News,Photos/Pics,Images..