Satyadev : సత్య దేవ్ ఫేస్ పై ఉన్న గుర్తుకు చిరంజీవి సినిమాకు ఉన్న సంబంధం ఏంటో తెలుసా ?

సినిమా ఇండస్ట్రీ( Movie Industry ) ఎవరికి పూలపాన్పు కాదు.ఇండస్ట్రీలో రాణించాలంటే మంచి బ్యాగ్రౌండ్ ఉండాలి లేదా డబ్బు ఉండాలి.

ఇవి రెండూ లేకుండా చిత్రాలు తీయాలి, గొప్పగా స్టార్ అవ్వాలి అంటే అది అందని ద్రాక్ష గానే మిగిలిపోతుంది.కానీ చిన్నతనం నుంచి హీరో అవ్వాలనే ఒకే ఒక కసి అతడిని హీరో చేసింది.

ఓవైపు సాఫ్ట్వేర్ ఉద్యోగం, లక్షల్లో జీతం అయినా కూడా అన్నింటినీ వదిలేసి సినిమా కోసమే తన ఊపిరి అన్నట్టుగా భావించి హీరో అవకాశాలు దొరక్క పోవడంతో ఆఖరికి జూనియర్ ఆర్టిస్ట్( Junior Artist ) గా కూడా నటించి ఆ తర్వాత తానేంటో నిరూపించుకుని హీరోగా మారిన నటుడు సత్యదేవ్.ఇక సత్యదేవ్ ఊరికే హీరో అయిపోలేదు.

అతని జీవితంలో చిన్ననాటి నుంచి నేటి వరకు అంతా సినిమానే నిండిపోయి ఉంది.అతని జీవితంలో సినిమాకి ఉన్న ప్రాముఖ్యత ఏంటో తెలియాలంటే ఈ ఒక్క ఉదాహరణ చెబితే సరిపోతుంది.

Advertisement

మీరు ఇక్కడ చూస్తున్న ఫోటోలో సత్యదేవ్( Satyadev ) కి నుదటి పైన ఒక మచ్చ ఉంటుంది.ఆ మచ్చ తన చిన్నతనం లో తగిలిన గాయం తాలూకా మరక అని తెలుస్తూనే ఉంది.అయితే ఇంత గాయం జరగడానికి గల కారణం ఏమై ఉంటుంది అని తెలిస్తే మన ఊహకు కూడా అందని ఒక నిజం ఉంది.

చిరంజీవి నటించిన కొదమ సింహం( Kodama Simham ) సినిమా మీకు గుర్తుందా ? ఆ చిత్రంలో హీరో చిరంజీవి ఒక తాడు సహాయంతో ఒక కొండమీద నుంచి మరో కొండ మీదికి వెళ్లే ప్రయత్నం చేసి సక్సెస్ అవుతాడు.ఆ సన్నివేశాన్ని టీవీలో చూసిన సత్యదేవ్ కేబుల్ వైరు పట్టుకుని వేలాడట.

అయితే .తరచుగా అలా వేలాడుతున్న సమయంలో ఒక రోజు కేబుల్ వైరు తెగిపోయి టీపాయ్ పైన పడటంతో కనుబొమ్మ పైన పెద్ద గాయం జరిగిందట.

అక్కడ డాక్టర్లు కుట్లు వేశారట.అయితే కొన్ని రోజులకు అది ఇన్ఫెక్షన్( Infection ) గా మారి చాలా పెద్ద ప్రమాదానికి కారణం అయిందట.దాని తాలూకా గాయపు మచ్చ ఇప్పటికీ అలాగే ఉంది.

పుష్ప2 హిట్టైనా నోరు మెదపని టాలీవుడ్ స్టార్ హీరోలు.. ఇంత కుళ్లు ఎందుకు?
వలసదారులపై డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం .. భారతీయులకు మేలు !

ఆ గుర్తే ఇప్పటికే సత్యదేవ్ మీద ఉంది.అది చూసిన ప్రతిసారి తాను ఎంతటి సినిమా పిచ్చి కలిగిన వ్యక్తిని అని తనకు తానే అనుకుంటాడట.

Advertisement

అందుకే సత్యదేవ్ హీరో కావాలని చిన్నతనం నుంచి అనుకున్నాడు.అలాగే వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు.

జూనియర్ ఆర్టిస్ట్ గా మొదలుపెట్టిన తన ప్రయాణం నేడు ఒక మంచి హీరో అని అనిపించుకునే వరకు కొనసాగింది.ఇక 2023 సంవత్సరానికి సత్య దేవ్ రెండు సినిమాల్లో నటిస్తున్నాడు.

ఒకటి కృష్ణమ్మ( Krishnamma ) మరొకటి ఫుల్ బాటిల్( Full Bottle )/em>.ఇక 2022వ సంవత్సరంలో అతడు ఐదు సినిమాలతో అలరించాడు.

కేవలం హీరో గానే కాదు విలన్ గా కూడా నటించడానికి సత్యదేవ్ ఎలాంటి కండిషన్స్ పెట్టుకోలేదు.

తాజా వార్తలు