అఫ్గానిస్థాన్‌ లో పోలీసుల ఎన్కౌంటర్ నుండి తృటిలో బయటపడ్డ సత్యదేవ్..!!

సినిమాల్లో నటించాలని చాలామంది అనుకుంటూ ఉంటారు.అయితే సినిమాల్లో నటించడం అంటే మాములు విషయం కాదు.

 Hero Sathyadev Arrested By Police In Afghanistan, Satyadev, Jyothi Laxmi, Bluf M-TeluguStop.com

ఎన్నో ఒడిదుడుకులను తట్టుకుని నిలవాలి.మన తెలుగు సినీ పరిశ్రమలో ఇలా స్వయం కృషితో కష్టపడి పైకి ఎదిగిన స్టార్ హీరోలు చాలా మందే ఉన్నారు.

అలా ఎవరి అండా దండా లేకుండా కష్టపడి పైకి వచ్చిన వాళ్లలో సత్య దేవ్ కూడా ఒకరు.ఇతనికి ఇండస్ట్రీలో ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేదు.

కేవలం మెగాస్టార్ చిరంజీవిపై ఉన్న వీరాభిమానంతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు సత్య దేవ్.ఆ తరువాత మెల్లగా స్టార్ హీరోల సినిమాలలో సైడ్ క్యారెక్టర్స్ చేస్తూ తెగ బిజీ అయ్యాడు.

అయితే సత్యదేవ్ సోలో హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీలో పేరు తెచ్చుకోవడానికి చాలా సమయం పట్టింది అనే చెప్పవచ్చు.

మొదట సారి సోలో హీరోగా జ్యోతిలక్ష్మి అనే సినిమాలో నటించాడు.

అయితే ఈ సినిమాలో ఛార్మి ప్రధాన పాత్ర పోషించగా, డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఆ సినిమాలో మేల్ లీడ్ పాత్రకు ఆడిషన్స్ నిర్వహిస్తున్నారు అని తెలియడంతో సత్యదేవ్ కూడా ఆ ఆడిషన్స్ కు అక్కడకు వెళ్లారు.అయితే అక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకుందాం అనుకున్నాడు.

అయితే సరిగ్గా వారం రోజుల తరువాత ఈ సినిమాలో హీరోగా సెలెక్ట్ అయినట్టు సత్యదేవ్ కి ఒక తీపి కబురు అందింది.అయితే ఆ సమయంలో సత్యదేవ్ ఓవర్ వెయిట్ గా ఉన్నాడు.

సినిమాలో నువ్వు చేసే పాత్రకు ఇంత ఓవర్ వెయిట్ ఉండకూడదు.బరువు తగ్గమని సత్యదేవ్ కు సలహా ఇచ్చాడు పూరీ.

దర్శకుడి సలహా మేరకు సత్యదేవ్ ఏకంగా 12 కేజీలు బరువు తగ్గి జ్యోతిలక్ష్మి సినిమాలో హీరోగా అవకాశాన్ని దక్కించుకున్నాడు.ఇక అక్కడ మొదలైన అతని ప్రస్థానం హీరోగా కనసాగుతూనే వస్తుంది.

వరుస సినిమాలతో బిజీ అయ్యాడు.ఇక బ్లఫ్ మాస్టర్ మూవీతో సత్యదేవ్ కి మంచి పేరు వచ్చింది.

ఆ క్రేజ్ తోనే కరోనా కాలంలో ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లో పెద్ద స్టార్ అయిపోయాడు సత్యదేవ్.ప్రస్తుతం ఫుల్ బిజీగా చేతి నిండా సినిమాలతో ఉన్నాడు సత్య దేవ్.

అయితే తన కెరీర్ ను ఇప్పుడిప్పుడే ఒక గాడిలోకి తెచ్చుకుంటున్న సమయంలో సత్యదేవ్ కు ఒక చేదు అనుభవం ఎదురైందట.

Telugu Afghanistan, Bluf Master, Bollywood, Habeeb, Jyothi Laxmi, Satyadev, Toll

అసలు విషయం ఏంటంటే సత్యదేవ్ కొన్ని రోజుల క్రితం ఆఫ్గనిస్తాన్ లో చావు అంచుల వరకు వెళ్లి వచ్చాడట.ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పడం విశేషం.“‘హబీబ్‌’ అనే హిందీ చిత్రం షూటింగ్ అఫ్గానిస్థాన్‌ లో జరుగుతోంది.కెమెరా నాలుగోవ అంతస్థులో ఉంది.నేను ఫోన్‌ మాట్లాడుతూ నడుచుకుంటూ వెళుతుంటా.అలా చేయడమే సీన్‌ అన్నమాట.అయితే ఈలోపు అక్కడికి ఆఫ్గనిస్తాన్ పోలీసులు వచ్చేశారు.

అంటే నేను సీన్ లో భాగంగా అక్కడక్కడే తిరుగుతూ, ఫోన్ మాట్లాడటం వల్ల వారికి అనుమానం వచ్చింది.ఆ ప్రాంతంలో అప్పటికే 9 ఆత్మాహుతి దాడులు జరిగాయట.

దానితో వాళ్ళు నన్ను అనుమానించి, నా తలపై తుపాకీ గురి పెట్టారు.తరువాత మేము సినిమా వాళ్లమని షూటింగ్ అవసరం అయ్యి అక్కడకి వచ్చామని ఇండియన్ ఎంబసీ చెప్పడంతో వదలిపెట్టారు.

లేదంటే .ఆ రోజే నా ప్రాణాలు ఆఫ్గనిస్తాన్ పోలీసుల చేతుల్లో గాలిలో పోయేవి” అని సత్యదేవ్ చెప్పుకొచ్చాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube